జాతీయ వార్తలు

ఖైదీలకు సలాడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, డిసెంబర్ 25: మధ్యప్రదేశ్‌లోని అన్ని జైళ్లలో ఖైదీలకు ప్రతిరోజూ భోజనంతోపాటు సలాడ్‌ను వడ్డించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఖైదీలకు పోషకాహారాన్ని అందించడానికి తీసుకోవలసిన చర్యలలో భాగంగా భోజనంతోపాటు సలాడ్‌ను వడ్డించాలని జైళ్ల శాఖ భావిస్తోందని జైళ్ల విభాగం డైరెక్టర్ జనరల్ సంజయ్ చౌదరి ఒక వార్తాసంస్థకు చెప్పారు. రాష్ట్రంలోని జైళ్ల నిర్వహణను సమీక్షించడానికి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. జైళ్ల శాఖ మంత్రి కుసుమ్ మెహ్‌దేలే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖలోని సీనియర్ అధికారులు, 39 జిల్లాలు, 11 కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులు భోపాల్‌లోని సెంట్రల్ జైలునుంచి ఈ సంవత్సరం అక్టోబర్‌లో పారిపోయిన సంఘటన తరువాత జైళ్లలోని ఖైదీలకు బయటినుంచి ఆహారం సరఫరాను నిషేధించారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లలోనూ ఖైదీలకు ఎక్కువగా వారి కుటుంబ సభ్యులు ఆహార పదార్థాలను ఇప్పటివరకు తీసుకువచ్చారు. టూత్‌పేస్ట్, బ్రష్‌లను కూడా జైళ్లలోనే సరఫరా చేయడం జరుగుతుందని ఈ సమావేశంలో మంత్రి తెలిపారు. అయితే బీడీలు, సిగరెట్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తారని ప్రజాసంబంధాల అధికారి ఒకరు చెప్పారు. సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఖైదీలు ఉన్న జైళ్లలో అదనపు బారక్‌లను నిర్మించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. జైళ్లకు ఔటర్ ప్రహరీ గోడలను కూడా నిర్మించాలని నిర్ణయించారు. జైలు సూపరింటెండెంట్‌లు లేవనెత్తిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.