జాతీయ వార్తలు

రూ.కోటి కోసం.. మూడేళ్ల చిన్నారి కిడ్నాప్.. హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 25: కోటి రూపాయల కోసం మూడున్నరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన 16 ఏళ్ల మైనర్లు ఆ తర్వాత ఆ బాలికను దారుణంగా హత్య చేసిన ఉదంతం ముంబయిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సియోన్‌లోని ఓ కాలేజిలో చదువుతున్న ఈ ఇద్దరు బాలురను ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాగ్‌పడా ప్రాంతంలోని కసమ్ చాల్ ప్రాంతంలోని కాజిపుర వద్ద శనివారం రాత్రి బాలిక మృతదేహాన్ని కనుగొనడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. మృతురాలి పొరుగునే ఉండే నిందితుల్లో ఒకరు నేరం చేసినట్లు పోలీసు విచారణలో అంగీకరించడంతో మృతదేహం పడి ఉన్న చోటికి వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీనుంచి ఈ బాలిక కనిపించడం లేదు. బాలిక తల్లిదండ్రులు జెజె మార్గ్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు కూడా. దర్యాప్తు సందర్భంగా బాలికను కిడ్నాప్ చేసినట్లు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన బాలుడ్ని ప్రశ్నించినప్పుడు ఈ హత్య వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాలుడితో పాటు అతని స్నేహితుడు కలిసి 5వ తేదీన క్లోరోఫామ్ ఉపయోగించి ఈ బాలికను కిడ్నాప్ చేశారు. అదే రోజు మొబైల్ ఫోన్ రీచార్జర్ వైర్‌తో ఆమె గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులకు గుర్తు తెలియని వ్యక్తులనుంచి కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. అంత భారీ మొత్తం ఇవ్వలేని వారు చివరికి 28 లక్షల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు. ఆ తర్వాత కిడ్నాపర్లు సొమ్ముతో వారిని ఠాణె జిల్లాలోని కల్వా పట్టణంలో ఉన్న ఓ ప్రదేశానికి రావలసిందిగా చెప్పారని, అయితే డబ్బు తీసుకోవడానికి వారు మాత్రం రాలేదని డిప్యూటీ పోలీసు కమిషనర్ మనోజ్ కుమార్ చెప్పారు. బాలిక కిడ్నాప్ వివరాలు చెప్పిన బాలుడ్ని అనుమానించిన తాము 15 రోజుల పాటు అతనితో పాటు మరో మిత్రుడిపై నిఘా పెట్టి ఉంచామని, చివరికి నిన్న రాత్రి ప్రశ్నించడం కోసం వారిని అదుపులోకి తీసుకున్నప్పుడు వారు నేరాన్ని అంగీకరించారని ఆయన తెలిపారు.