జాతీయ వార్తలు

రాజ్యసభ సభ్యత్వానికి మిథున్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: తృణమూల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయిన నటుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్య కారణాల రీత్యా సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించారని పార్టీ వర్గాలు తెలిపాయి. శారద చిట్‌ఫండ్ కుంభకోణంతో ఆయనకు సంబంధం ఉన్నట్లు నిరుడు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2014 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయిన ఆయన ఇప్పటివరకు కేవలం మూడు రోజులే సభకు హాజరయ్యారు. అనారోగ్యం వల్ల తాను తన విధులను నిర్వర్తించలేక పోతున్నానని, అందువల్ల రాజ్యసభ సభ్యత్వాన్ని వదలుకోవాలని కోరుకుంటున్నానని ఆయన రాజ్యసభ చైర్మన్‌కు అందజేసిన పత్రంలో పేర్కొన్నారు.