జాతీయ వార్తలు

ఇక ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ రుణం లభించడంతో మరింత ఊతం వచ్చినట్టయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును 2018కల్లా పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టస్తామని ప్రకటించారు. 2018 మార్చి నాటికి డ్యాం భాగాన్ని పూర్తి చేస్తామని, డిసెంబర్ ఆఖరు లేదా 2019 వర్షాకాలానికి ముందే అన్ని పనులు పూర్తి చేసి రెండు కాలువలకు నీరు అందజేస్తామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత త్వరగా నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. వాజపేయి నదుల అనుసంధానంపై దృష్టి సారిస్తే నరేంద్ర మోదీ వ్యవసాయ రంగం మై దృష్టిసారించటం ఆనందం కలిగిస్తోందని, అలాగే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపికి
కేటాయించి పోలవరం నిర్మాణానికి సహకరిస్తున్నారంటూ ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
నీరు, తాగునీరు పుష్కలం
దేశంలో మొదటిసారి నీటిపారుదల ప్రాజక్టులకు నాబార్డ్ లభించడం చారిత్రాత్మిక దినమని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వలన రాష్ట్రంలోని 15.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నేరుగా నీటిపారుదల సౌకర్యం కలుగుతుందని, 540 గ్రామాలలోని ముప్పై లక్షల మంది ప్రజలకు తాగునీరు, విశాఖపపట్టణంతో పాటు స్థానిక పరిశ్రమలకు కూడా నీటి సౌకర్యం కలుగుతుందని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పిత్తి అవుతుందన్నారు. కృష్ణా. గోదావరి జిల్లాల్లోని 24 లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరిస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు సిద్ధం చేశామని, నిర్మాణం పనులు చక,చకా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులో ఇది అతి పెద్దది, ఇక మీదట రాష్ట్రంలో మరో ప్రాజెక్టు నిర్మాణం జరుగకపోవచ్చునని పేర్కొన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను మళ్లించటం వలన నదీ జలాల నిర్వహణ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు, తమిళనాడు, తెలంగాణా, కర్నాటక రాష్ట్రాలలోని ఆయకట్టును స్థిరీకరించవచ్చునని చెప్పారు. పోలవరం పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, ఇంతవరకూ వరకు 11 సార్లు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లివచ్చానన్నారు. పోలవరం పూర్తి అయితే రాష్ట్రంలో కరువును తరిమికొట్టవచ్చునన్నారు.ప్రాజెక్టు పూర్తి అయ్యేంత వరకు నిధుల లభ్యత ఇలాగే ఉండాలని ఆయన ఉమాభారతికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.