జాతీయ వార్తలు

నిపుణులతో కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: కొత్త బడ్జెట్, నగదు రద్దు తదితర కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆర్థిక నిపుణులతో చర్చించబోతున్నారు. నీతి ఆయోగ్‌కు చెందిన సీనియర్ అధికారులతో జరిగే ఈ సమావేశంలో పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపైనా, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చిస్తారు. అలాగే మారిన పరిస్థితుల నేపథ్యంలో జనహితానికి దోహదం చేసే విధంగా కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉండాలన్న అంశమూ ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ‘ఆర్థిక విధాన సంస్కరణ..తదుపరి అడుగులు’అన్న అంశంపైనే విస్తృత స్థాయి సమాలోచనలు జరుగుతాయని వివరించాయి. మొత్తం 15మంది ఆర్ధిక నిపుణులు భిన్న అంశాలపై తమ విధానాలు, ఆలోచనలను ఆవిష్కరిస్తారని ఈ సందర్భంగా 2017-18 బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి కూడా మోదీ వీరి అభిప్రాయాలు సేకరిస్తారని సీనియర్ అధికారి ఒకరు వివరించారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత ఆర్ధిక వేత్తలతో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా బహుళజాతి ఆర్థిక సంస్థలు, భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును తగ్గించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. తాజా సవాళ్లను ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోబోతోంది, నగదు రద్దు దరిమిలా తలెత్తిన పరిణామాలపై తదుపరి అడుగులు ఏమిటన్న ఉత్కంఠ నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన విత్త విధానంలో వృద్ధి రేటును 7.6శాతం నుంచి 7.1శాతానికి ఆర్‌బిఐ తగ్గించిన విషయం తెలిసిందే. లక్కీ గ్రహక్ యోజన, డిజి ధన్ వ్యాపార్ యోజన తదితర పధకాలతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నివ్వడానికి తీసుకున్న చర్యలను కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీ సమీక్షిస్తారు. ఇదిలా ఉండగా, అవినీతి, నల్లధనాన్ని రూపుమాపే లక్ష్యంలో భాగంగా బినామీ లావాదేవీల గుట్టురట్టు చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఆదాయం పన్ను చట్టంలో ఉన్న లోపాల్ని ఆసరా చేసుకుని నల్ల కుబేరులు ఇతరుల పేరిట ఆస్తులు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టిన మోదీ ఈ లోపాల్ని తొలగించేందుకు నడుంబిగించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి పెట్టి రియల్ కుబేరులను ఆటకట్టించడమే మిగిలిందని సీనియర్ అధికారి సోమవారం వెల్లడించారు. బ్యాంకులు, ఇతర మార్గాల ద్వారా వివిధ ఖాతాదారులకు సంబంధించిన కీలకల సమాచారాన్ని సేకరించిన అధికారులు దాని ఆధారంగానే బినామీల గుట్టు రట్టు చేసే దిశగా ముందుకు వెళతారని తెలిపారు.