జాతీయ వార్తలు

నోట్ల రద్దు కష్టాలు ఇప్పట్లో తొలగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బారన్ (రాజస్థాన్), డిసెంబర్ 26: నోట్ల రద్దు వల్ల ఏర్పడిన తీవ్ర నగదు కొరత వంటి కష్టాలు డిసెంబర్ 30తో తొలగిపోతాయని ఇచ్చిన హామీ ఏమయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. నోట్ల రద్దువల్ల ఏర్పడిన ఆర్థిక మాంద్యం మున్ముందు కూడా పేదలు, రైతులు, కార్మికులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. ‘డిసెంబర్ 30 తరువాత నోట్ల రద్దు కష్టాలు తొలగిపోతాయని మోదీ చెప్పారు. కాని, ఆయన చెప్పినట్టు ఈ కష్టాలు ఇప్పట్లో తీరబోవని నేను ఎంతో విశ్వాసంతో చెప్పగలను. మరో ఆరేడు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలమే ఈ కష్టాలు కొనసాగుతాయి’ అని సోమవారం ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాహుల్ అన్నారు. నోట్ల రద్దు తరువాత 50 రోజులు దాటాక కష్టాలు తొలగిపోవడం ప్రారంభం అవుతుందని మోదీ ఇచ్చిన హామీని ఆయన ప్రస్తావించారు. నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి మోదీపై తన దాడిని కొనసాగించిన రాహుల్ గాంధీ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాజస్థాన్‌లో వసుంధరా రాజే ప్రభుత్వం పేదలను ఆదుకోవడానికి ఒక్కచర్య కూడా తీసుకోలేదని విమర్శించారు. ‘నోట్ల రద్దు అవినీతి వ్యతిరేక చర్య కాదు. పైగా దీనివల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ చర్య నల్లధనానికి కూడా వ్యతిరేకం కాదు. ఇది పేదలు, రైతులు, కార్మికులు, మహిళల వ్యతిరేక చర్య’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘దేశంలోని 99శాతం మంది ప్రజల వద్ద నల్లధనం లేదు. కాని, వీరంతా నోట్ల రద్దువల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. మరోవైపు, 50 కుటుంబాల వద్ద లక్షల కోట్ల నల్లధనం ఉంది’ అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని నిర్మూలించాలని కోరుకుంటోందని, అవినీతి వ్యతిరేక చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎన్‌డిఏ ప్రభుత్వానికి మద్దతిస్తారని పేర్కొంటూ, దురదృష్టవశాత్తు నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా దేశ ప్రజలకు వ్యతిరేకమైనదని ఆయన ధ్వజమెత్తారు. నల్లధనంలో కేవలం ఆరు శాతం మాత్రమే నగదు రూపంలో ఉందని, మిగతాదంతా రియల్ ఎస్టేట్, బంగారం, స్విట్జర్లాండ్‌లోని బ్యాంకు ఖాతాల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లుగా మోదీ దేశ ప్రజల్లో విభజన తేవడానికి, సంపన్న వర్గాల ప్రయోజనాలకోసం మాత్రమే పనిచేశారని ఆయన దుయ్యబట్టారు.

చిత్రం..రాజస్థాన్‌లోని బరాన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శిస్తున్న ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ