జాతీయ వార్తలు

కలెక్టరేట్ల ఎదుట 5న కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: పెద్దనోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జనవరి ఐదో తేదీన దేశంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తుంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన సోమవారం జరిగిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, పిసిసి అధ్యక్షులు, సీనియర్ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి వి.హనుమంతరావు ఒక్కరే హాజరు కావటం గమనార్హం. జనవరి 8 తేదీనాడు మహిళలు ఖాళీ గినె్నలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకే కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని రాజీవ్ గాంధీ సూచించారు. ఆయా రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, కార్యవర్గం, ప్రజాప్రతినిధులందరు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సూచించారు. తెలంగాణలో తాను ఇప్పటికే ఈ అంశంపై పలుచోట్ల ధర్నాలు నిర్వహించానని హనుమంతరావు వివరించారు.