జాతీయ వార్తలు

అన్ని హామీలూ నెరవేరుస్తాం: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబర్ 26: విభజన వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామన్న హామీని పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ రుణం విడుదల చేయటం ద్వారా కొంతవరకు నిలబెట్టుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. జాతీయప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కేంద్రం నుండి ఆర్థిక సహాయ అందుతుందా? అనే అనుమానాలను చాలామంది వ్యక్తం చేశారంటూ నాబార్డు రుణంతో ఈ అనుమానాలకు నివృత్తి చేశామని ఆయన అన్నారు. ఇది ఎంతో చారిత్రాత్మక దినమని జైట్లీ చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను పూర్తి చేస్తామంటూ వీటి అమలులో కొంత ఆలస్యమైనా మొత్తం మీద అన్నింటిని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర విభజన మూలంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ తనను అడిగేవారని, తెలుగుదేశం మంత్రి సుజనా చౌదరి, ఎంపి సిఎం రమేష్‌లు రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు మూలంగా ఏపిలోని కరువు ప్రాంతాల సమస్యలు తీరుతాయని జైట్లీ అభిప్రాయపడ్డారు.

చిత్రం..సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రులతో సమాలోచనలు చేస్తున్న ఏపి సిఎం