జాతీయ వార్తలు

నేనే సిఎస్‌ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 27: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇంకా తానే కొనసాగుతున్నానని, తనకు ఇంత వరకూ బదిలీ ఉత్తర్వులు జారీ కాలేదని బర్త్ఫ్‌క్రు గురైన పి.రామమోహన రావు స్పష్టం చేశారు. తన ఇంటిపై జరిగిన ఆదాయం పన్ను దాడులను ఓ ఉన్నతాధికారి కార్యాలయంపై జరిగిన దాడిని రాజ్యాంగ ఉల్లంఘనగా ఆయన అభివర్ణించారు. అసలు సెర్చ్ వారెంట్‌లో తన పేరు లేనే లేదని పేర్కొన్న ఆయన పదేపదే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరును ఉటంకించారు.జయ బతికి ఉంటే తన కార్యాలయంపై దాడులు జరిగేవే కాదన్నారు. మంగళవారం అన్నానగర్‌లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడిన రామమోహన రావు తనకు ఇసుక మైనింగ్ వ్యాపారి శేఖర్ రెడ్డితో ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఇంట్లో తనిఖీలు చేసిన ఆదాయం పన్ను అధికారులకు కేవలం లక్ష 12వేల 320రూపాయలు మాత్రమే దొరికాయని, అలాగే తన భార్య, కుమార్తె వంటిపై 40 నుంచి 50 సవరన్‌ల బంగారం ఉందని, దేవుడి విగ్రహాలు సహా 25కిలోల వెండి వస్తువులు వారికి కనిపించాయని చెప్పారు. ఇవి తప్ప ఎలాంటి కీలక పత్రాలూ వారికి లభించలేదని పేర్కొన్న రామమోహన రావు తనను సిఆర్‌పిఎఫ్ గృహ నిర్బంధంలో ఉంచిందని చెప్పారు. తనను బర్త్ఫ్ చేసినప్పటికీ తానే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీనని, తనను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదని అన్నారు. ‘పురుచ్చితలైవి జయలలిత నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యర్శిని ఇప్పటికీ నేనే’నని ఆయన పునరుద్ఘాటించారు. తనకు మద్దతు పలికిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కొందరు అన్నాడిఎంకె నేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన అసలు తన కార్యాలయంపై దాడులు చేయడానికి ముందు ఐటి అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి పనీర్‌సెల్వం అనుమతి తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ చాంబర్‌లో ముఖ్యమంత్రులకు సంబంధించిన కీలక వివరాలు, వారి నిర్ణయాలు, ఇతర రహస్య నివేదికలు, మంత్రులు, ఐపిఎస్‌లు, ఐఎఎస్‌లపై దాఖలైన క్రిమినల్ కేసుల వివరాలు ఉంటాయని చెప్పారు. ఈ చాంబర్‌లో ఐటి అధికారులకు ఎమ్‌ఆర్‌సి క్లబ్ సభ్యత్వ పత్రం లభించిందని, అలాగే ఇతర మామూలు పత్రాలూ దొరికాయన్నారు. తన కుమారుడ్ని లక్ష్యంగా చేసుకుని ఐటి దాడులు జరిగాయని చెప్పిన రామమోహన రావు అతడు అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచీ తనతో ఉండటం లేదన్నారు. తనను లక్ష్యంగా చేసుకున్నారని, తన ప్రాణానికి ముప్పు ఉందని మీడియాతో అన్నారు. తమిళనాడులో తనకు వేలాది మంది తెలుసునని, శేఖర్ రెడ్డితో గానీ అతడి వ్యాపారాలతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించారు. గత మూడు దశాబ్దాలుగా తమిళనాడులోనే ఉంటున్నానని చెప్పిన ఆయన జయలలిత లేకపోవడం వల్ల తమిళనాడులో భద్రతే లేదని వ్యాఖ్యానించారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న రామమోహన రావు