జాతీయ వార్తలు

పట్టు తప్పిన ‘జెట్’ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, డిసెంబర్ 27: పనాజి విమానాశ్రయంలో మంగళవారం తెల్లవారుజామున 161 మందితో ముంబయి వెళుతున్న జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. 154 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో ముంబయి వెళ్తున్న ఈ విమానం తెల్లవారుజామున 5 గంటల సమయంలో టేకాఫ్ అవుతుండగా ముందు చక్రం అదుపు తప్పి 360 డిగ్రీల కోణంలో గింగిరాలు తిరుగుతూ రన్‌వేనుంచి జారి మట్టిలోకి దిగబడింది. విమానం ముక్కు భాగం రన్‌వేనుంచి జారి పక్కన ఉన్న గడ్డిని తాకుతున్నట్లుగా ఉండడాన్ని బట్టి చూస్తే ఎంత ఘోర ప్రమాదం తప్పిందో అర్థమవుతుంది. ఈ ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. విమానం జారిపోయే సమయంలో పెద్ద కుదుపులు వచ్చినట్లు ప్రయాణికులు చెప్తున్నారు. విమానంలోని ప్రయాణికులు భయపడి ఒక్కసారిగా బైటికి రావడానికి ప్రయత్నించడంతో జరిగిన తొక్కిసలాటలో ఈ 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని ఆస్పత్రిలో చికిత్స అనంతరం గాయపడిన వారిలో ఏడుగురిని డిశ్చార్జి చేసినట్లు, గోవానుంచి తమ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయినట్లు జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. కాగా, విమానానికి చెందిన ఇద్దరు పైలెట్ల ఫ్లైట్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశామని, ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నామని పౌర విమానయాన శాఖ తెలియజేసింది. కాగా, ప్రాథమికంగా ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణంగా కనిపిస్తోందని డిజిసిఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తు నివేదిక వారం రోజుల్లో సమర్పించడం జరుగుతుందని, అప్పుడు ప్రమాదానికి కారణాలేమిటో తెలుస్తాయని ఆ అధికారి తెలిపారు.
దుబాయినుంచి డంబోలిన్ విమానాశ్రయానికి చేరుకున్న విమానం అక్కడినుంచి ముంబయికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తాము సకాలంలో స్పందించి ప్రయాణికులను కాపాడామని, లేకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగిపోయి ఉండేదని నేవీ వర్గాలు తెలిపాయి. కాగా, విమానంలోంచి ప్రయాణికులను బయటికి తీసుకువచ్చే సమయంలో విమానం ఓ పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికులంతా భీతావహులయ్యారని వాస్కోలోని చికాలిమ్ కాటేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ ప్రయాణికుడు చెప్పారు. గోవా విమానాశ్రయం నౌకాదళ స్థావరం ‘ఐఎన్‌ఎస్ హంస’ లోపల ఉంది.

చిత్రాలు.. గోవాలోని డబోలిమ్ విమానాశ్రయంలో టేకాఫ్ దశలో రన్‌వే నుంచి పక్కకు ఒరిగిన జెట్ ఎయర్‌వేస్ విమానం
*తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది