జాతీయ వార్తలు

మా డబ్బుకు లెక్కలున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 27: తమ పార్టీ తీసుకుంటున్న విరాళాలు కానీ, తమ పార్టీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.104 కోట్లు కానీ పూర్తిగా చట్టబద్ధమైనవని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. బిఎస్‌పికి చెందిన ఓ ఖాతాలో రూ.104 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించిన ఒక రోజు తరువాత మాయావతి స్పందించారు. పార్టీ ఖాతాతో పాటు తన సోదరుడు ఆనంద్‌కు చెందిన మరో ఖాతాలో రూ.1.43 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. లక్నోలో మంగళవారం మాట్లాడిన ఆమె బి ఎస్‌పి మొదటి నుంచీ కూడా విరాళాల సేకరణ విషయంలో అన్ని నిబంధనలను పాటించిందని తెలిపారు.
ప్రస్తుతం బ్యాంకులో ఉన్న డిపాజిట్ పెద్ద నోట్ల రద్దుకు ముందు స్వీకరించిన విరాళాలేనని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె దళిత్ కార్డును కూడా ప్రయోగించారు. బిజెపి దళిత వ్యతిరేక ధోరణితో తమ పార్టీపై దాడి చేస్తోందని ఆమె ఆరోపించారు. తాను దళిత మహిళ కాబట్టే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనను కాకుండా అడ్డుకోవటానికి కుట్ర పన్నుతున్నారని ఆమె విమర్శించారు. తన సోదరుడు ఆనంద్‌కు సొంతంగా వ్యాపారం ఉందని, ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారమే అతను డిపాజిట్లు చేశారని ఆమె తెలిపారు. బిజెపి అనుకూల చానళ్లు, పత్రికలు తమకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని మాయావతి ఆరోపించారు.