జాతీయ వార్తలు

శేఖర్ రెడ్డి బెయిల్‌పై తీర్పు 30కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 27: రద్దయిన పెద్ద నోట్లను కోట్లాది రూపాయల మేర కొత్త నోట్లతో మార్చుకున్న కేసులో అరెస్టయిన ఇసుక మైనింగ్ వ్యాపారి శేఖర్ రెడ్డి, మరో నలుగురి బెయిల్ పిటిషన్లకు సంబంధించి తీర్పు 30కి వాయిదా పడింది. ప్రిన్సిపల్ ప్రత్యేక సిబిఐ కోర్టు న్యాయమూర్తి విజయలక్ష్మి ముందు నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదన వినిపించారు. ప్రైవేటు వ్యక్తుల్ని అరెస్టు చేయడం ద్వారా సిబిఐ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిందని అన్నారు. వీరిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో బ్యాంకు అధికారుల పేర్లు లేవని పేర్కొన్నారు. శేఖర్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం న్యాయబద్ధంగా సంపాదించిందేనని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. తమ క్లయింట్లు నిర్దోషులని, అమాయకులని మిగతా వారి తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున వీరికి బెయిల్ ఇవ్వడం మంచిది కాదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. మామూలు వ్యక్తులకు రెండు వేల రూపాయలే దొరకని పరిస్థితుల్లో నిందితులు 24కోట్ల రూపాయల మేర కొత్త నోట్లు ఎలా సంపాదించగలిగారని ప్రశ్నించారు.