జాతీయ వార్తలు

కోట్లకు పడగలెత్తిన ఎంసిఐ మాజీ సభ్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 29: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు డాక్టర్ గుణశేఖర్ యాదవ్, అయన సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటి అధికారులు జరిపిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఐటి అధికారులు ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఈ నెల 27వ తేదీ మంగళవారం ఉదయం నుంచి ఆయన ఇంటిపైన, సమీప బంధువుల ఇళ్ళపైనా 27 మంది ఐటి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో పరిశీలించారు. బుధవారం రాత్రి నాటికి ఈ దాడులు పూర్తియినట్లు తెలుస్తున్నా ఏ మేరకు ఆస్తులు పట్టుబడ్డాయన్న విషయం గోప్యంగా ఉంచారు. అయితే గురువారం మాత్రం రూ.400 కోట్లు మేర అక్రమాస్తులను తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సుమారు 30 కేజీలకు పైగా బంగారం ఆభరణాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గుణశేఖర్ యాదవ్‌కు రాష్ట్ర మంత్రి నారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఐటి అధికారులు నోరు విప్పితే డాక్టర్ అక్రమాస్తుల వెనుక ఎంతమంది నేతల హస్తం ఉందన్న విషయం కూడా బయటపడే అవకాశం ఉంది.