జాతీయ వార్తలు

అది బిజెపి రాజకీయ అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలులోకి తేవటం అన్నది అధికార బిజెపి రాజకీయ అజెండాలో భాగమేనని ప్రధాన విపక్షాలు ఆరోపించాయి. ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్ర న్యాయ కమిషన్ ప్రజాభిప్రాయం కోరుతూ రూపొందించిన పదహారు ప్రశ్నలకు దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాయి. దేశంలో మూడు తలాఖ్‌ల విధానాన్ని రద్దు చేయాలా వద్దా? దేశంలో ప్రజలందరికీ ఒకే పౌరస్మృతి ఉండాలా వద్దా? అన్న అంశాలపై అభిప్రాయం చెప్పాలని న్యాయకమిషన్ అక్టోబర్ 7న ఒక ప్రశ్నావళి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్, బిఎస్‌పి, టిఎంసి, ఏఐఎంఐఎం, ఎన్‌సిపి తదితర పార్టీలు తమ వైఖరులను వెల్లడించాయి. బిజెపి తన రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికే ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించాయి. దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అత్యంత వివాదాస్పదమైన అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్చనీయాంశం చేశారని విమర్శించాయి. దేశ ప్రజల మీద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అజెండాను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ విమర్శించింది. మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ఇదే ధోరణితో ముందుకు వెళ్తున్నారని ఆ పార్టీ పేర్కొంది. అలిండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేత అసదుద్దీన్ ఒవైసీ ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే కొన్ని కోర్టు ఆదేశాలకు తాను మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ తలాఖ్‌ను వ్యతిరేకించింది. లా కమిషన్ ప్రశ్నావళికి ఇప్పటివరకు 40వేల మంది వ్యక్తులు, వ్యవస్థల నుంచి సమాధానాలు వచ్చాయి. నిర్దేశించిన గడువు ముగిసిన తరువాత కూడా స్పందనలు వస్తున్నాయి.