జాతీయ వార్తలు

విశ్వమానవుడు అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ 125వ జయంతిని దేశమంతటా ఘనంగా నిర్వహించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి మహమ్మద్ హమీద్ అన్సారీ గురువారం పార్లమెంటు లాన్స్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ఆయన విశ్వ మానవుడని ప్రశంసించారు. దేశంలోని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అర్పించిన అంబేద్కర్ ధన్యుడని మోదీ చెప్పారు. విద్య ద్వారానే సాధికారతను సాధించగలుగుతామన్నది అంబేద్కర్ దృఢ విశ్వాసమంటూ రైతులు, కార్మికుల సంక్షేమాన్ని సాధించే ఆర్థిక విధానాన్ని అమలు చేయటం అంబేద్కర్ ఆర్థిక విధానమని ప్రధానమంత్రి చెప్పారు.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, సామాజిక సాధికారత శాఖ మంత్రి తవర్ చందర్ గెహ్లోట్ తదితరులు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయటంతోపాటు కొత్త పథకాలను ప్రారంభిస్తోంది. రేపటి నుండి ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ్ ఉదయ్ ద్వారా భారత్ ఉదయ్ ఉద్యమాన్ని సాంఘిక సామరస్య కార్యక్రమంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో గ్రామాల్లో ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రతిజ్ఞ చేస్తారు. అంబేద్కర్ జీవితం, జాతీయ సమైక్యతపై ఆయన ఆలోచనలు, అందుకు సంబంధించిన సాహిత్యాన్ని గ్రామాల ప్రజలకు పంపిణీ చేస్తారు.
అంబేద్కర్ జీవితంపై ప్రధాన స్థలాల్లో ప్రదర్శనలు నిర్వహించటం ద్వారా ప్రజలను జాగృతం చేస్తారు. ఈ నెల 17 నుండి మూడు రోజుల పాటు అన్ని గ్రామాల్లో గ్రామ కిసాన్ సభలు నిర్వహించి వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తారు. రైతులతో నిర్వహించే చర్చల్లో ప్రధానమంత్రి పంటల బీమా పథకం, ప్రధాన మంత్రి వ్యవసాయ నీటిపారుదల పథకాలు, భూసార ఆరోగ్య కార్డుల గురించి వారికి అవగాహన కల్పిస్తారు. గ్రామ సభల్లో గ్రామాభివృద్ధికి సంబంధించిన పథకాల గురించి సమాలోచనలు జరుపుతారు. ప్రధానమంత్రి గ్రామ రహదారి పథకం, జాతీయ ఉపాధి కల్పన హామీ పథకం తదితర పథకాల గురించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివరిస్తారు. ప్రధాని రేపు డాక్టర్ అంబేద్కర్ జన్మ స్థలమైన మధ్యప్రదేశ్‌లోని మహూ గ్రామం నుండి పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయటం, గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమంకోసం ఒక జాతీయ పథకాన్ని ప్రారంభిస్తారు.

చిత్రం గురువారం మధ్యప్రదేశ్‌లోని భీంరావ్ అంబేద్కర్ పుట్టిన స్థలం భీం జన్మభూమిని సందర్శించి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ, సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్