జాతీయ వార్తలు

భూమి కేటాయిస్తే.. నిధులిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం కింద సొంత ఇల్లు లేని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించడానికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి ఆ కుటుంబాల్లోని మహిళా సభ్యులకు భూమిని కేటాయించాలని ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై) పేరుతో ప్రారంభించిన ఈ పథకం కింద 2022 నాటికి తక్కువ ఆదాయాలున్న వారికి లేదా ఆర్థికంగా బలహీన వర్గాలకు 2కోట్ల పక్కా ఇళ్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు ఆ ఇళ్లకు విద్యుత్, తాగునీరు, వంటగ్యాస్ కనెక్షన్లు కూడా కల్పిస్తారు. ఈ ఇళ్లలో 60 శాతం ఇళ్లను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కచ్చా ఇళ్లలో నివసించే ఇళ్లు లేని వారికోసం కేటాయించడం జరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ సింగ్ చెప్పారు. ఈ ఇళ్లకోసం మైదాన ప్రాంతాల్లో నివసించే లబ్ధి దారుల ఖాతాల్లోకి ప్రభుత్వం లక్షా 20 వేల రూపాయలను నేరుగా బదిలీ చేస్తుందని ఆయన చెప్పారు. ఇదే కాకుండా మరుగు దొడ్ల నిర్మాణానికి రూ. 12 వేలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఏ) కింద రూ.18 వేలకు సమానమైన 90 రోజులు పనిని కల్పిస్తారు. అలాగే కొండ ప్రాంతాల్లో అయితే ఇంటి నిర్మాణంకోసం లక్షా 30 వేలతోపాటుగా మిగతా ప్రయోజనాలు కల్పిస్తారు. ఇళ్లులేని కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అలాంటి కుటుంబంలోని మహిళా సభ్యురాలి పేరున భూమిని కేటాయించాలని, అందువల్ల ఇంటి నిర్మాణానికి వారికి నిధులు కేటాయించడానికి వీలవుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్‌జీత్ సిన్హా చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఇళ్లు లేని కుటుంబాలకు భూమిని కేటాయించాయని, మరికొన్ని రాష్ట్రాలు ఆ ప్రక్రియలో ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. నిధులు దారి మళ్లకుండా చూడడానికి ఈ పథకం కింద నిర్మించిన అన్ని ఇళ్లకు జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుందని సిన్హా చెప్పారు. అంతేకాదు, ఇందుకోసం ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను సైతం రూపొందించడం జరిగిందని, అందులో లబ్ధిదారుల ఫోటోలతోపాటుగా వారికి సంబంధించిన అన్ని వివరాలను అప్‌లోడ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో నరేంద్ర మోదీ ఈ ‘ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన’ను ప్రారంభించారు.