జాతీయ వార్తలు

తదుపరి ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29:పెద్ద నోట్ల రద్దు కష్టాలపై ఇచ్చిన 50రోజుల గడువు శుక్రవారంతో ముగుస్తున్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి మరోసారి మాట్లాడబోతున్నారు. తదుపరి చర్యలకు సంబంధించిన ప్రణాళికను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. కొత్త సంవత్సరం ఆరంభానికి ముందే తన తదుపరి చర్యలను జాతికి తెలియజేయాలని మోదీ భావిస్తున్నట్టుగా వెల్లడించాయి. నవంబర్ 8న 500, 1000 నోట్ల చెలామణిని రద్దు చేసిన మోదీ తనకు 50రోజుల పాటు గడువు ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. ఇన్ని వారాలుగా కొత్త నోట్ల సరైన పరిమాణంలో అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందులను మోదీ ప్రస్తావిస్తారని, ఈ సమస్యను తీర్చే మార్గాలనూ ప్రకటిస్తారని అధికార వర్గాలు వివరించాయి. ముఖ్యంగా నగదు రద్దు ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై ఏ మేరకు ఉండబోతోంది, దాన్ని నివారించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ల బోతున్నామో కూడా శనివారం చేసే ప్రసంగంలో మోదీ వెల్లడించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.