జాతీయ వార్తలు

జకీర్ నాయక్‌పై ఇడి క్రిమినల్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 30: వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. యువతను ఉగ్రవాదంవైపుప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయక్ విదేశాల్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఇడి తాజాగా మనీలాండరింగ్ చట్టం కింద ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ముంబయిలోని జోనల్ ఆఫీసు జకీర్ నాయక్‌పై కేసు నమోదు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జకీర్, మరికొందరిపై అభియోగాలు నమోదయ్యాయి. నాయక్, ఐఆర్‌ఎఫ్ సంస్థ లావాదేవీలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) ఆరాతీస్తోంది. నిందితులకు త్వరలోనే సమన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. యువత ఉగ్రవాదంపై ఆకర్షించేలా 51 ఏళ్ల జకీర్ నాయక్ ప్రయత్నిస్తున్నారంటూ ఎన్‌ఐఎ గతనెలలో కేసు నమోదు చేసింది. వెంటనే జకీర్ నాయక్ తదితరులకు చెందిన నివాసాలు, పది చోట్ల ముంబయి పోలీసులు సోదాలు నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద దాడి తరువాత జకీర్ నాయక్ పేరు బయట ప్రపంచానికి తెలిసింది.