జాతీయ వార్తలు

ఖండూ సర్కార్‌నే సమర్థిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, డిసెంబర్ 30: అరుణాచల్‌ప్రదేశ్‌లో పేమా ఖండూ ప్రభుత్వాన్ని మాత్రమే తమ పార్టీ సమర్థిస్తుందని, మరే ముఖ్యమంత్రిని సమర్థించబోదని ఆ రాష్ట్ర బిజెపి శుక్రవారం స్పష్టం చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అధికార పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పిపిఏ) ముఖ్యమంత్రి పేమా ఖండూ, ఉపముఖ్యమంత్రి చోవ్నా మేన్, మరో అయిదుగురు ఎమ్మెల్యేలలను తాత్కాలికంగా సస్పెం డ్ చేసిన నేపథ్యంలో బిజెపి ఈ విషయం స్పష్టం చేయడం గమనార్హం. రాష్ట్రంలోని నార్త్‌ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్ ప్రభుత్వంలో పిపిఏ భాగస్వామిగా బిజెపి ఉన్నప్పటికీ ఆ పార్టీ సమస్యపై తమతో చర్చించలేదని బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు తమియో తాగా శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. పిపిఏ హటాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం తమ పార్టీకి అంగీకారం కాదని, ఎందుకంటే పిపిఏ సమస్యను తమతో ఎప్పుడూ చర్చించలేదని ఆయన అన్నారు. ఒక వేళ గవర్నర్ గనుక సభలో బలపరీక్షకు ఆదేశించినట్లయితే తమ పార్టీ ఖండూకే మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయించిందని కూడా జవుళి, హస్తకళల శాఖ మంత్రి అయిన తాగా స్పష్టం చేశారు.
49 మంది ఎమ్మెల్యేల మద్దతు
* ఖండూ ప్రభుత్వం ప్రకటన
అరుణాచల్ ప్రదేశ్‌లో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై గురువారం రాత్రి ముఖ్యమంత్రి పేమా ఖండూ, మరో ఆరుగురు ఎమ్మెల్యేలను పిపిఏనుంచి బహిష్కరించి 24 గంటలు తిరక్క ముందే తమ ప్రభుత్వానికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని ఖండూ ప్రభుత్వం ప్రకటించింది. శాసన సభలోని మొత్తం 60 మంది ఎమ్మెల్యేల్లో 49 మంది మద్దతు తమకు ఉందని ఖండూ ప్రభుత్వం ప్రకటించింది. పిపిఏకు చెందిన 43 మంది ఎమ్మెల్యేల్లో 35 మంది, బిజెపికి చెందిన 12 మంది, మరో బిజెపి అనుబంధ సభ్యుడు, ఒక ఇండిపెండెంట్ ఖం డూ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించారని ప్రభుత్వ ప్రతినిధి బమంగ్ ఫెలిక్స్ చెప్పారు. పిపిఏ ఏకవ్యక్తి పార్టీ కాదని, పార్టీ అధ్యక్షుడు కఫా బెంగియా తీసుకున్న నిర్ణయం ఆయన సొంతమని కూడా ఫెలిక్స్ స్పష్టం చేశారు. మరోవైపు ఖండూ స్థానంలో తకమ్ పారియో కొత్త ముఖ్యమంత్రి అవుతారని బెంగియా అంటున్నారు.