జాతీయ వార్తలు

జార్ఖండ్‌లో కూలిన బొగ్గు గని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొడ్డా, డిసెంబర్ 30: జార్ఖండ్‌లోని రాజ్‌మహల్ ప్రాంతంలో ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌కు చెందిన లాల్‌మాటియా ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని గురువారం రాత్రి కుప్పకూలిపోవడంతో కనీసం 9 మంది గని కార్మికులు చనిపోగా, మరికొంతమంది గనిలోపల చిక్కుకు పోయి ఉన్నట్లు భయపడుతున్నారు. ప్రమాద స్థలంనుంచి ఇప్పటివరకు 9 మంది మృత దేలను వెలికి తీసినట్లు, గాయపడిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఉన్నతాధికారి ఆర్‌ఆర్ మిశ్రా తెలిపారు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినప్పుడు గనిలోపల 50 మంది దాకా కార్మికులున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలంలో ఉన్నట్లు ఇసిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరపడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల సహాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించగా, కార్మికుల పరిహార చట్టం కింద చెల్లించే మొత్తం కాకుండా అదనంగా 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఇసిఎల్ తెలిపింది. గాయపడిన వారికి 25 వేల రూపాయల సహాయాన్ని కూడా సిఎం ప్రకటించారు. అధికారుల సమాచారం ప్రకారం గనిలోపల 15-20 మంది దాకా కార్మికులు చిక్కుపడి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి గని ముఖద్వారం వద్ద కొంత భాగం కూలిపోయినట్లుగా కనిపిస్తోందని, లోపల చిక్కుకుపోయిన వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే వారి పరిస్థితిపై ఇప్పటికిప్పుడే ఏమీ చెప్పలేమని ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ జిఎం నీలాద్రి రాయ్ చెప్పారు. గనిలోపల 10-15 యంత్రాలు పని చేస్తున్నాయని, వాటినన్నిటినీ బైటికి తీసినట్లు ఆయన చెప్పారు. మామూలు పరిస్థితిని పునరుద్ధరించేందుకు బొగ్గు మంత్రి పీయూష్ గోయల్, జార్ఖండ్ ప్రభుత్వం కృషి చేస్తున్నాయని, పరిస్థితిపై ముఖ్యమంత్రితో ఫోన్‌లో కూడా మాట్లాడానని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.