జాతీయ వార్తలు

నా ప్రశ్నలకు బదులేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30 : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. గతంలో చేసిన ఐదు ప్రశ్నలనే రాహుల్ సంధించారు. రాహుల్ గాంధీ వారం రోజుల క్రితం మోదీకి ఇవే ప్రశ్నలు వేయటం తెలిసిందే. పెద్దనోట్ల రద్దు మూలంగా ఉత్పన్నమైన పరిస్థితి చక్కబడేందుకు విధించిన 50 రోజుల గడువుశుక్రవారంతో ముగిసినందున తాను అడిగిన ఐదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఉపాధ్యడు డిమాండ్ చేశారు. ‘దేశ ప్రజలు మీ సమాధానాల కోసం వేచి చూస్తున్నారు’అని రాహుల్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నవంబర్ 8 తేదీనాడు పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇంత వరకు ఏ మేరకు నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారు? పెద్ద నోట్ల రద్దుతో దేశానికి ఆర్థికపరంగా ఎంత నష్టం కలిగింది? ఎంత మంది ఉపాధి కోల్పోయారు? అని రాహుల్ నిలదీశారు. అలాగే నోట్ల కోసం క్యూలో నిలబడి ఎంత మంది మరణించారు? వారికి నష్ట పరిహారం చెల్లించారా? పెద్ద నోట్లను రద్దు చేయటం గురించి ప్రధాన మంత్రి ఎవరెవరితో చర్చలు జరిపారు? నిపుణులు, ఆర్థికశాస్తవ్రేత్తలు, రిజర్వు బ్యాంకుతో ఎందుకు సంప్రదింపులు జరపలేదు? అని ప్రధానిపై ప్రశ్నలు సంధించారు. నవంబర్ 8 తేదీకి ముందు ఆరు నెలల్లో బ్యాంకు ఖాతాల్లో 25 లక్షల రూపాయలను ఎంత మంది డిపాజిట్ చేశారు? అని రాహుల్ గాంధీ అడిగారు. నరేంద్ర మోదీ శనివారం పెద్ద నోట్ల రద్దుపై జాతినుద్దేశించి ప్రసంగించనున్న తరుణంలో రాహుల్ మరోసారి గతంలో అడిగిన ఐదు ప్రశ్నలనే ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెద్ద నోట్ల రద్దు పూర్తిగా విఫలమైంది, ఇదొక పెద్ద కుంభకోణం, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందంటూ కాంగ్రెస్‌తోపాటు యావత్ ప్రతిపక్షం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.