జాతీయ వార్తలు

సహకారంతోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 30: దేశంలో ఒకరికొకరు సహకరించుకునే స్ఫూర్తి ఉంటే దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధం అవుతుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రభుత్వం, ప్రజా సంఘాలు గనుక ఒకదానితో ఒకటి సహకరించుకున్నట్లయితే దేశ అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని కూడా ఆయన అన్నారు. ‘బెంగళూరు నగరం మిగతా దేశానికి విద్యా కేంద్రం, ఆరోగ్యం కేంద్రంగా మారుతోంది. తమ నగరాన్ని అటు విద్య, ఆరోగ్య రంగాలకు కేంద్రంగా మార్చినందుకు విద్యావేత్తలు, దాతలు, వైద్యులు, శాస్తజ్ఞ్రులను అభినందిస్తున్నాను’ అని రాష్టప్రతి అన్నారు. ప్రజలు సహకార స్ఫూర్తిని పెంపొందిస్తున్న తీరును చూసినట్లయితే ఈ స్ఫూర్తి దేశాన్ని అన్ని రంగల్లోను స్వయం సమృద్ధంగా మారుస్తుందనడంలో తనకెలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు. శుక్రవారం ఇక్కడ ‘అదమ్య చేతనా సేవా ఉత్సవ-2017’ను, శ్రీ శంకర నేషనల్ సెంటర్ ఫర్ క్యాన్స ర్ ప్రివెన్షన్, రిసెర్చ్‌ను ప్రారంభించిన సందర్భంగా రాష్టప్రతి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ రుదభాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య తదితరులు హాజరయ్యారు.
‘అదమ్య చేతన’ కేంద్ర మంత్రి అనంతకుమార్ 1997లో తన తల్లి దివంగత గరిజా నారాయణ శాస్ర్తీ స్మృత్యర్థం స్థాపించిన సేవా సంస్థ. ఈ సంస్థ ఆహారం, విద్య, ఆరోగ్యం ప్రధానాంశాలుగా విద్యా రంగంలో సేవలు అందిస్తుంది. అదమ్య చేతన ద్వారా సమాజానికి సేవలందిస్తున్నందుకు అనంతకుమార్‌ను, ఆయన భార్య తేజస్వినిని రాష్టప్రతి అభినందిస్తూ ప్రభుత్వమే అన్నీ చేయాలని మనం ఆశించలేమన్నారు. ‘మనం సొంతంగా పరిష్కరించుకోలేని సమస్యలు చాలా ఉంటాయి. వ్యక్తులు, సంస్థలకన్నా ప్రభుత్వం ఎక్కువ చేయగలదనే మాట నిజమే. అయితే ప్రభుత్వం అన్నీ చేయలేదు’ అని ఆయన అన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా తాను పాల్గొన్న 1995లో డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ ప్రభుత్వాధినేతల సదస్సును ఆయన గుర్తు చేసుకుంటూ, సమాజంలోని అసమానతలను తొలగించే బాధ్యత ప్రజలదేనని ఆ సమావేశం గుర్తించిందని, ఆకలితో అల్లాడే చిన్నారుల ఆకలి తీర్చడం ముఖ్యమనే విషయాన్ని హైలైట్ చేసిందని రాష్టప్రతి చెప్పారు.