జాతీయ వార్తలు

తృణమూల్ ఎంపీ తపస్ పాల్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 30: రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్‌ను శుక్రవారం సిబిఐ అరెస్టు చేసింది. శుక్రవారం సిబిఐ ఎదుట హాజరయిన తపస్‌పాల్‌ను నాలుగు గంటల పాటు సిబిఐ అదికారులు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. రోజ్‌వ్యాలీ కంపెనీలలో ఒకదానికి డైరెక్టర్‌గా నియామకం గురించి, ఆ సంస్థ బెంగాల్ సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడం సహా తాము అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఎంపీ సరయిన సమాధానం చెప్పలేకపోయారని సిబిఐ అధికారులు తెలిపారు. మరింత లోతుగా ప్రశ్నించడం కోసం పాల్‌ను భువనేశ్వర్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రశ్నించడం కోసం ఈ రోజు నగరంలోని సాల్ట్‌లేక్‌లో ఉన్న కార్యాలయంలో తమ ముందు హాజరు కావాలని సిబిఐ ఈ నెల 27న పాల్‌కు సమన్లు జారీ చేసింది.