జాతీయ వార్తలు

కక్ష సాధింపు సాగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 30: నగదు రద్దు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ 50లోజులుగా పెద్దనోట్ల రద్దు కారణంగా ప్రజలకు కలిగించిన ఇబ్బందులు ఆయన క్షమాపణ కూడా చెప్పాలని అన్నారు. కేంద్రంలో బిజెపికి చెందిన సీనియర్ నేత ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టాలని లేదా ఓ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. బ్రిటీష్ పాలనలోగానీ ఎమర్జెన్సీ సమయంలో గాని ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని ఆమె అన్నారు. మోదీ ప్రభుత్వం కక్ష సాధింపురాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తిన మమత మొత్తం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలందరినీ అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. 50 రోజులు గడిచిపోయినా కూడా ప్రజలకు నోట్ల కష్టాలు తీరలేదని ఇందుకు పూర్తి బాధ్యత మోదీదేనని ధ్వజమెత్తిన ఆమె‘ ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పిమరీ తప్పుకోవాలి’అని శుక్రవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. రోస్‌వాలీ చిట్‌ఫండ్ కుంభకోణంతో సంబంధం ఉందంటూ తమ పార్టీ ఎంపీ తపస్ పాల్‌ను అరెస్టు చేయడంపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ‘మా పార్టీ ఎంపీలందరినీ అరెస్టు చేసినా నేను ఖాతరు చేయను. కానీ మీరు అనుసరించేది కక్షసాధింపురాజకీయమే. పెద్దనోట్ల రద్దుపై మేం చేపట్టిన పోరాటం ఆగనే ఆగదు’అని ఉద్ఘాటించారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నందుకే తమ పార్టీ ఎంపీని సిబిఐ అరెస్టు చేసిందని ఆమె ఆరోపించారు. అంతేకాదు కేంద్రం తీసుకోబోయే తదుపరి చర్యలపై కూడా తమ వద్ద పూర్తి సమాచారం ఉందని మమత వెల్లడించారు. తరువాత సిబిఐ ఎవరెవరిని పిలవబోతోందో ఆ జాబితా కూడా తన వద్ద ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే సమన్లు అందుకున్న తన పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ సిబిఐ ముందు గర్వంగా హాజరవుతారని ఆమె తెలిపారు. చిట్‌ఫండ్ కంపెనీలపై చర్యలు తీసుకోవల్సిన సెబీ, ఆర్‌బిఐలు తన విధులను నిర్వర్తించలేదని పైగా ఈ కంపెనీలు రాష్ట్రాల అధికార పరిధిలోకి వచ్చేవికావని తెలిపారు. కానీ సెబి, ఆర్‌బిఐలు వీటికి రక్షణ కల్పించాయని ధ్వజమెత్తిన మమత ‘ఓ కంపెనీ ఆతిధ్యాన్ని అంగీకరించినంత మాత్రన లబ్దప్రతిష్టుడైన ఓ నటుడ్ని లేదా ఓ క్రీడాకారుణ్ని ఎలా అరెస్టు చేస్తారు?’అని ప్రశ్నించారు. పైగా ఈ చిట్‌ఫండ్ కంపెనీలకు టివి అప్‌లింకింగ్ అనుమతి ఎలా లభించిందని నిలదీశారు. అనేక కంపెనీలకు నటులు, క్రీడాకారులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారని గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లకు అమితాబ్, షారూక్‌ఖాన్‌లు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

చిత్రం..శుక్రవారం కోల్‌కతాలో విలేఖరులతో మాట్లాడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ