జాతీయ వార్తలు

అఖిలేష్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 30:ఉత్తర ప్రదేశ్ అధికార సమాజ్‌వాది పార్టీలో రాజకీయ సంక్షోభం పరాకాష్ఠకు చేరుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అభ్యర్థులపై సొంత అభ్యర్థులను ప్రకటించినందుకు ముఖ్యమంత్రి, తన కుమారుడైన అఖిలేష్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్‌లపై అధినేత ములాయం సింగ్ యాదవ్ బహిష్కరణ వేటు వేశారు. వీరిద్దరినీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెంట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని తెలిపారు. గత కొన్ని రోజులుగా సమాజ్‌వాది పార్టీలో రాజకీయ కుమ్ములాట సాగుతున్నప్పటికీ ఏకంగా ముఖ్యమంత్రిపైనే ములాయం చర్య తీసుకోవడం ఒక్కసారిగా పరిస్థితిని వేడెక్కించింది. ఆరేళ్ల పాటు బహిష్కృతుడైన ముఖ్యమంత్రి అఖిలేష్ పరిస్థితి ఏమిటన్న దానిపై సర్వత్రా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బహిష్కరణ వేటు పడటం, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని ములాయం ప్రకటించడంతో అఖిలేష్ ఏ క్షణంలోనైనా రాజీనామా చేయవచ్చునని తెలుస్తోంది. తాజా పరిణామంతో విస్తుపోయిన అఖిలేష్ మద్దతుదారులు ఆయన ఇంటికి వెళ్ల మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఉదయం నుంచీ కూడా సమాజ్‌వాది పార్టీ కుమ్ములాటలు నాటకీయ ఫక్కీలో క్షణక్షణం వేడెక్కుతూ సాగాయి. ఆకస్మికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ములాయం తిరగుబాటు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్, శివ్‌పాల్‌లను బహిష్కరిస్తున్నామని తెలిపారు. పార్టీని రక్షించేందుకే తాను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను కష్టపడి నిర్మించిన పార్టీ కళ్లముందే కూలిపోయే పరిస్థితి తలెత్తడం తనకు బాధ కలిగించిందని, అందుకే వీరిద్దరినీ తప్పించానన్నారు. అఖిలేష్, రామ్‌గోపాల్ కంటే కూడా తనకు పార్టీ ముఖ్యమని ఉద్ఘాటించారు. ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితుల్ని ములాయం వివరించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో రామ్‌గోపాల్ యాదవ్ జనవరి ఒకటిన పార్టీ ఎమర్జెన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేశారని, దాన్ని అఖిలేష్ బలపరిచారని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తాను ముందే ప్రకటించానని, దాన్ని సవాలు చేస్తూ సమాంతర జాబితా విడుదల చేసినందుకు తాను వీరిద్దరికీ షోకాజ్ నోటీసులు పంపానని చెప్పారు. దీన్ని సవాలు చేస్తూ జనవరి ఒకటిన పార్టీ ఎమర్జెన్సీ సమావేశానికి పిలుపునివ్వడం వల్లే వారిని బహిష్కరించాల్సి వచ్చిందన్నారు. అధికారిక అభ్యర్థులను పార్టీ నాయకత్వం ప్రకటించిన తర్వాత అఖిలేష్ సొంత జాబితాను ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. సమాజ్‌వాది పార్టీని నాశనం చేయడమే వారి లక్ష్యమని..దాన్ని శాయశక్తులా అడ్డుకుంటానని ములాయం ఉద్ఘాటించారు. తన కుమారుడు అఖిలేష్‌కు ఎంతో ఆర్బాటంగా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టానని ఆయన గుర్తు చేశారు. పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే అధికారం కేవలం అధ్యక్షుడికి మాత్రమే ఉంటుందని..ప్రధాన కార్యదర్శికి ఆ హక్కు లేదని అన్నారు. సమాజ్‌వాది పార్టీకి బలమైన నియమ నిబంధనలు ఉన్నాయని, రామ్‌గోపాల్ యాదవ్ చెప్పుచేతల్లో అది నడవదని తేల్చిచెప్పారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన రామ్‌గోపాల్ యాదవ్ వల్ల పార్టీకే తీరని నష్టం కలుగుతోందని చెప్పారు. తన కుమారుడ్ని లోబరచుకుని అతడి రాజకీయ కెరీర్‌ను దెబ్బతీసిన రామ్‌గోపాల్‌ను కేవలం బహిష్కరణతో వదిలేదని లేదని స్పష్టం చేశారు. అతడి వల్ల తనకు కలుగుతున్న నష్టం ఏమిటో అఖిలేష్‌కు అర్థం కావడం లేదని కూడా ములాయం వ్యాఖ్యానించారు. అఖిలేష్ క్షమాపణ చెబితే క్షమిస్తారా అన్న ప్రశ్నను జవాబివ్వకుండా దాటవేశారు.
ఎమర్జెన్సీ భేటీ ఆగదు: రామ్‌గోపాల్
తనను అఖిలేష్‌ను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని రామ్‌గోపాల్ సవాలు చేశారు. ములాయం తీసుకున్న చర్య పార్టీ నియమావళికి విరుద్ధమని, తానే ప్రధాన కార్యదర్శినని తెగేసి చెప్పారు. ఏది ఏమైనా జనవరి ఒకటిన సమాజ్‌వాది పార్టీ ఎమర్జెన్సీ సమావేశం జరిగి తీరుతుందన్నారు. పార్టీ అగ్ర నాయకత్వమే నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు..ఎమర్జెన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ప్రధాన కార్యదర్శికే ఉంటుందని రామ్‌గోపాల్ యాదవ్ ఉద్ఘాటించారు.
అంతా చూస్తున్నా: గవర్నర్
రాష్ట్ర రాజకీయ పరిణామాల్ని లోతుగా గమనిస్తున్నానని గవర్నర్ రామ్ నాయక్ అన్నారు. ఈ పరిస్థితిని అధికార పార్టీలో ఏర్పడ్డ సంక్షోభంగా భావిస్తారా అన్న ప్రశ్నకు ‘ఇది పార్టీ అంతర్గత వ్యవహారం’అని జవాబిచ్చారు. అఖిలేష్ స్ధానే కొత్త వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే గవర్నర్ పాత్ర కీలకమవుతుంది.

చిత్రాలు..అఖిలేష్‌పై వేటును నిరసిస్తూ శరీరానికి నిప్పు పెట్టుకున్న అభిమాని.* రోడ్డెక్కిన కార్యకర్తలు. *పార్టీ శ్రేణులకు సిఎం అఖిలేష్ అభివాదం