జాతీయ వార్తలు

వేలి ముద్ర చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: నగదు రహిత లావాదేవీలను మరింత సరళం చేసే దిశలో ప్రధాని నరేంద్రమోదీ కొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. శుక్రవారం ప్రారంభించిన యాప్ భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (బిహెచ్‌ఐఎం) పేరిట అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అందుబాటులోకి వచ్చింది. భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతిగా విడుదలైన యాప్ పేదల్లో కెల్లా పేదలకు సాధికారత కల్పిస్తుందని మోదీ అన్నారు. భీమ్ యాప్ దేశ ప్రజలకు తానిస్తున్న కొత్త ఏడాది కానుకగా అభివర్ణించారు. ‘మరో రెండు వారాల్లో మరో సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుంది. దానికి సంబంధించిన భద్రతపై పరీక్ష జరుగుతోంది. దీని వల్ల భీమ్‌కు సాధికారత లభిస్తుంది. మీరు ఎవరికైనా డబ్బులు చెల్లించాలంటే మీ వేలిముద్ర ఉంటే సరిపోతుంది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
లక్కీ గ్రాహక్ యోజన, డిజి ధన్ వ్యాపారీ యోజన పథకాలకు సంబంధించిన లక్కీ డ్రా విజేతలను కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు 75వేల మంది విజేతలు ఎంపికయ్యారు. ఈ రెండు లక్కీ డ్రా పథకాలను డిసెంబర్‌లోనే ప్రభుత్వం ప్రకటించింది. రూ.50 నుంచి రూ.3 వేలవరకు లావాదేవీలు జరిపిన వారికి లక్కీ డ్రాలలో విజేతలుగా ఎంపిక చేస్తారు. క్రిస్మస్ పర్వదినం నుంచి ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకాలకు సంబంధించి మెగాడ్రాను భీంరావ్ అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న తీస్తారని మోదీ తెలిపారు. ‘పేదలను సాధికారత దిశగా పథకాలను రూపొందించటానికి మీడియాతో సహా సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు’ అన్నారు. మొదటి డిజి దన్ మేలా హర్యానాలోని గురుగ్రామ్‌లో సోమవారం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించటం, వివిధ ఆన్‌లైన్ చెల్లింపుల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని ఉపయోగించేలా ప్రోత్సహించటం కోసం ఈ పురస్కారాల పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

చిత్రం..భీం యాప్ ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతున్న మోదీ