జాతీయ వార్తలు

ఏం చెబుతారో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పెద్దనోట్ల రద్దు తరువాత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. 500, 1000 నోట్ల రద్దు తరువాత నల్లధనం అదుపులోకి వచ్చిందన్న అంశం ప్రధాని ప్రసంగంలో ఉంటుందా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. నవంబర్ 8 రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ పెద్ద నోట్ల రద్దు ప్రకటించటం తెలిసిందే. పాత నోట్ల రద్దు వల్ల నెలకొన్న నోట్ల లభ్యత సమస్యలు పరిష్కరించేందుకు 50 రోజుల సమయం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోదీ తీసుకున్న గడువు శుక్రవారంతో ముగిసింది. పాత నోట్లను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు విధించిన గడువుకూడా ముగిసింది. ఆర్‌బిఐలో మాత్రం మార్చి 31 వరకూ డిపాజిట్ చేసుకునేందుకు వీలుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ శనివారం జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. పెద్దనోట్ల రద్దు పరిణామాలు, ప్రయోజనాల గురించి ప్రధాని వివరించవచ్చునని బిజెపి నేతలు చెబుతున్నారు. ఏమేరకు నల్లధనం అదుపులోకి వచ్చింది? బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన పాత నోట్లలో ఏ మేరకు నల్ల ధనం ఉన్నదనేది కూడా మోదీ వివరించవచ్చని అంటున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత పెద్ద నోట్లలో కూడా నల్లధనం ఉన్నదని ఎన్‌డిఏ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం లక్షా యాభై వేల కోట్ల నల్లధనం అదుపులోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల అనధికారికంగా చెబుతున్నారు. మోదీ ప్రసంగంలో ఇలాంటి పలు అంశాలను ప్రజల ముందు పెట్టే అవకాశాలున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ఏమేరకు డబ్బు బ్యాంకుల్లోకి వచ్చింది? అందులో నల్లధనమెంత? అనేది కూడా తేలిపోనుంది. ఈ సమాచారంతోపాటు అవినీతిని అదుపు చేసేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం ఇకమీదట తీసుకోనున్న కొత్త చర్యలను కూడా ప్రధాని ప్రజల ముందు పెట్టవచ్చని అంటున్నారు. బినామీ ఆస్తులను అదుపు చేసేందుకు తాను తీసుకుంటున్న తదుపరి చర్యలను కూడా ప్రజలకు వివరించవచ్చని అంటున్నారు. నరేంద్ర మోదీ ఈ అంశంపై దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. నీతి, నిజాయితీతో కూడిన సమాజ నిర్మాణానికి తమ ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న కొత్త చర్యలను ప్రజలకు వివరించే అవకాశం ఉంది. జన్‌ధన్ యోజన కింద తెరిచిన ఖాతాల్లో డిపాజిట్ చేసిన నల్లధనం గురించి మోదీ విధానపరమైన ప్రకటన చేసినా ఆశ్చర్యపోకూడదని అంటున్నారు. జన్‌ధన్ ఖాతాలోని డబ్బును ఖాతాదారులైన పేదలకు దఖలు పరిచే అవకాశాలు లేకపోలేదనే మాట వినిపిస్తోంది. జన్‌ధన్ ఖాతాల్లో దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. నవంబర్ 8 నుండి డిసెంబర్ 25 వరకు మొత్తం 14 లక్షల కోట్ల పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యింది. దేశంలో మొత్తం 15 లక్షల 44 వేల కోట్లనగదు చెలామణిలో ఉన్నది. డిసెంబర్ 30 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం ఎంత అనేది కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశాలున్నాయి. పెద్ద నోట్ల రద్దు ఏ మేరకు విజయవంతమైందనేది ఆయన దేశ ప్రజల ముందు పెట్టవచ్చు.