జాతీయ వార్తలు

పట్టాలెక్కిన ప్యాసింజర్ రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం రూరల్, డిసెంబర్ 30: అనంతపురం జిల్లా రాయదుర్గం-కళ్యాణదుర్గం మధ్య ప్యాసింజర్ రైలు శుక్రవారం ప్రారంభమైంది. రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా కొత్తరైలును ప్రారంభించారు. రాయదుర్గంలో జరిగిన కార్యక్రమంలో ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, విప్ కాలవ శ్రీనివాసులు తదితరులు పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. రాయదుర్గం-కళ్యాణదుర్గం మధ్య ఈ కొత్త ప్యాసింజర్ రైలు రోజుకు రెండుసార్లు బళ్ళారి నుంచి వచ్చిపోతుంది. రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం, తుంకూరు మీదుగా బెంగళూరుకు రైలుమార్గం నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా రాయదుర్గం-కళ్యాణదుర్గం మధ్య 48 కిలోమీటర్ల దూరం రైలుమార్గం నిర్మాణం పూర్తయింది. ట్రయల్న్ విజయవంతం కావడంతో శనివారం ప్యాసింజర్ రైలును ప్రారంభించారు. తొలిరోజు 350 మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించారు. వారం రోజుల్లో బళ్ళారి నుంచి రాయదుర్గం మీదుగా కళ్యాణదుర్గానికి ప్యాసింజర్ రైలు ప్రతిరోజు రెండుసార్లు తిరుగుతుంది.