జాతీయ వార్తలు

రైలు టికెట్‌పై పదిపైసల సెస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: రైల్వే కూలీలకు నూతన సంవత్సర శుభవార్త. దాదాపు 20వేలకు పైగా ఉన్న వీరికి ఆర్థిక ధీమా కలిగించే దిశగా అడుగులు వేస్తోంది. వీరందరినీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిర్వహించే పథకాల పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా ప్రతి రైల్వే టికెట్‌పైనా పదిపైసల సెస్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనియత రంగాల్లో ఉన్న 40వేల కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాలన్న ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. ప్రతి రైల్వే టికెట్‌పైన పదిపైసల సెస్ వసూలు చేయడం వల్ల ఏడాదికి 4.38కోట్ల రూపాయలు సమకూరతాయని అంచనా. ఈ మొత్తంతో రైల్వే కూలీలకు పిఎఫ్, పెన్షన్, గ్రూపు బీమాను కల్పించగలుగుతామని అధికార వర్గాలు చెబుతున్నాయి. 50శాతం రిజర్వేషన్ సహా ప్రతి రోజూ 10-12లక్షల మేర రైల్వేలు ప్రయాణికులకు టికెట్లు విక్రయిస్తాయి. ఈ లెక్కన టికెట్‌పై పదిపైసలు సెస్ విధిస్తే రోజువారీగా 1.2లక్షల రూపాయలు సమకూరుతాయి. రైల్వే కూలీలకు అనేక రకాలుగా ప్రయోజనం కలిగించే ఈ పథకాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ త్వరలోనే రైల్వే, ఆర్థిక శాఖల ముందుంచుతుందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. టికెట్‌పై పదిపైసల మేర సెస్ విధించడం ప్రయాణికులకు ఎంత మాత్రం భారం కాదని, పైగా దీని వల్ల 20వేల మంది రైల్వే కూలీలు లబ్ధి పొందుతారని వివరించారు.