జాతీయ వార్తలు

దోమకాటు మరణమూ ప్రమాదమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: దోమకాటు వల్ల ఎవరు మరణించినా ప్రమాద కారణంగా జరిగిన మరణంగానే పరిగణించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. దీని వల్ల జీవిత బీమా పాలసీలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నా రు. దోమ కాటు వల్ల మలేరియా వల్ల అనేక మరణాలు సంభవిస్తున్నాయని, దీన్ని కూడా ప్రమాదంగానే పరిగణించాలని న్యాయమూర్తి వికె జైన్ తన రూలింగ్‌లో స్పష్టం చేశారు. ప్రమాదం లాగే దోమకాటు వల్ల మరణిస్తామని ఎవరూ అనుకోరని, ఇది కూడా ఆకస్మికంగా జరిగే పరిణామమేననడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. పాముకాటు, చలికొరికేయడం, కుక్కకాటు వంటి వాటివల్ల కలిగే మరణాలనూ ప్రమాదాలుగా పరిగణిస్తామని బీమా కంపెనీ వెబ్‌సైట్‌లోనే ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దోమకాటు కారణంగా వచ్చే మలేరియాను ప్రమాదంగా కాకుండా వ్యాధిగా భావించడానికి ఎంత మాత్రం వీల్లేదన్నారు. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వౌసమీ భట్టాచార్జీ అనే మహిళ భర్త దెబాసిష్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. అలాగే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ కూడా తీసుకున్నాడు. 2012లో దోమకాటు వల్ల మలేరియా రావడంతో ఆయన మరణించాడు. దాంతో తమ ఇంటి రుణాన్ని రద్దు చేయాలని..తన భర్త మరణాన్ని ప్రమాదం వల్ల జరిగినదిగానే పరిగణించాలని భట్టాచార్జీ సదరు బీమా కంపెనీని ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో 2014లో పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దబాసిష్ మరణించింది ప్రమాదం వల్ల కాదని, దోమకాటు వల్లేనని బీమా కంపెనీ వాదించింది. ఆ వాదనను తిరస్కరించిన ఫోరం భట్టాచార్జీకి అనుకూలంగానే తీర్పునిచ్చింది. దాంతో ఆ బీమా కంపెనీ పశ్చిమ బెంగాల్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడంతో జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఇక్కడ కూడా తాజా రూలింగ్‌తో ఆ కంపెనీకి చుక్కెదురైంది.