జాతీయ వార్తలు

అడ్డం తిరిగిన అఖిలేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 1: సమసినట్టే సమసిన యూపీ అధికార సమాజ్‌వాది పార్టీ ముసలం ఏకంగా పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌నే ముంచేసింది. తండ్రి ప్రాపకంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అఖిలేష్ ఏకంగా ఆయనే్న పార్టీ అధ్యక్ష పదవి ఉంచి తొలగించి అధికార పార్టీ పీఠాన్ని అధీష్టించాడు. ‘నేనే అధ్యక్షుడ్ని..ములాయం మార్గదర్శి’అంటూ ప్రకటించేశాడు. ఈ పరిణామంతో సమాజ్‌వాది పార్టీ నడిమధ్యకు చీలిపోయింది. ములాయం ఆదేశాలకు విరుద్ధంగా ఆదివారం జరిగిన పార్టీ సదస్సులో ఈ నిర్ణయాలు చకచకా జరిగిపోయాయి. సమాజ్‌వాది పార్టీకి తిరుగులేని అధినేతగా కొనసాగుతూ వచ్చిన ములాయం సింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఆ అధికారాన్ని అఖిలేష్‌కు ఆయన వర్గం అప్పగించింది. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అన్ని జిల్లా విభాగాలూ తమవైపేనని ప్రకటించింది. రామ్‌గోపాల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సంచలనాత్మక రీతిలో అనేక వివాదాస్పద నిర్ణయాలు ప్రకటించింది. సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంచి శివ్‌పాల్ యాదవ్‌ను తొలగించింది. ములాయంకు తలలో నాలుకగా వ్యవహరించిన అమర్ సింగ్‌కూ ఈ వర్గం ఉద్వాసన పలికింది. అధికార పార్టీ కుటుంబంలో ఈ చిచ్చు రగలడానికి అమర్‌సింగే కారణమంటూ ధ్వజమెత్తింది. ఈ వివాదంతో తనకేమీ సంబంధం లేదని, తన బతుకు తనను బతకనివ్వాలంటూ అమర్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరి వర్గాలు రెండూ పరస్పర బహిష్కరణలకు పాల్పడటంతో యూపీ రాజకీయాలు అనూహ్య రీతిలో వేడెక్కిపోయాయి. తాజా పరిణామాలతో విస్తుపోయిన ములాయం మరోసారి రామ్‌గోపాల్‌పై ఆరేళ్ల బహిష్కరణ వేటు వేశారు. తాజా సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా, ప్రధాన కార్యదర్శి నరేష్ అగర్వాల్‌లను తొలగించారు.
అఖిలేష్ యాదవ్‌ను సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా ‘ఏకగ్రీవం’గా ఎన్నుకుంటున్నట్టు ఈ ఎమర్జెన్సీ సమావేశంలో రామ్‌గోపాల్ యాదవ్ ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. ములాయం ఇక నుంచి మార్గదర్శిగానే వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి 200మంది ఎమ్మెల్యేలు, 30మంది ఎమ్మెల్సీలు, మెజార్టీ జిల్లా విభాగాల సభ్యులూ హాజరయ్యారని తెలిపారు. పార్టీ జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ బోర్డు, జిల్లా విభాగాలను ఏర్పాటు చేయాలని ‘కొత్త అధ్యక్షుడు’అఖిలేష్‌ను ఈ సమావేశం కోరింది. అలాగే పార్టీలో వచ్చిన తాజా మార్పుల గురించి త్వరితగతిన ఎన్నికల కమిషన్‌కు నివేదించాలని సూచించింది. ఇక్కడి జ్ఞానేశ్వర్ మిశ్రా పార్కులో జరిగిన ఈ సమావేశానికి వేల సంఖ్యలో హాజరైన అఖిలేష్ మద్దతుదారులు ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఎవరు హాజరైనా క్రమశిక్షణా రాహిత్యంగా భావిస్తామని ములాయం హెచ్చరించినప్పటికీ దాదాపు పార్టీకి చెందిన సీనియర్ నేతలందరూ అఖిలేష్, రామ్‌గోపాల్ యాదవ్‌లతో చేతులు కలిపారు.
ఇదంతా పార్టీ కోసమే:అఖిలేష్
తన తండ్రి ములాయం సింగ్ అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని ఈ సమావేశంలో మాట్లాడిన అఖిలేష్ అన్నారు. మరి కొన్ని నెలల వ్యవధిలో ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా సమాజ్‌వాది పార్టీకి వ్యతిరేకంగా కుట్ర పన్నిన వారిపై తన పోరు ఆగదన్నారు. ఈ కుట్ర దారులు జాతీయ అధ్యక్షుడైన ములాయానికి ఎక్కడలేని సవాళ్లూ సృష్టించారన్నారు. వీటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఆయన కుమారుడిగా తనకు ఎంతో ఉందన్నారు. రెండోసారి కూడా సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి రావాలన్నదే తన లక్ష్యమని, కానీ ఇందుకు కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తే ములాయానికి మించి ఆనందించేవారు ఎవరూ ఉండరని అఖిలేష్ అన్నారు.
5న నేనే సమావేశం పెడతా
ఎలాంటి అధికారం లేకుండా నిర్వహించిన సమాజ్‌వాది పార్టీ ఎమర్జెన్సీ సమావేశాన్ని ములాయం కొట్టిపారేశారు. ఆ వేదికపై తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లవని, అవన్నీ అక్రమమేనంటూ నిప్పులు చెరిగారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి అనుమతి లేకుండా జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఎంత మాత్రం చెల్లుబాటు కాదంటూ ఓ ఘాటైన లేఖ రాశారు. దీని వల్ల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీకి తీరని నష్టమే జరుగుతుందని హెచ్చరించారు. ఇదే వేదికపై తాను ఐదో తేదీన పార్టీ జాతీయ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. కాగా, కుమారుడిచ్చిన షాక్‌తో ములాయంకు తీవ్ర స్థాయిలో బీపి వచ్చినట్టుగా కధనాలు వెలువడ్డాయి.