జాతీయ వార్తలు

సిఇఎ, ఎఫ్‌ఎంల అభిప్రాయాలు స్వీకరించారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అకస్మాత్తుగా ప్రకటించడానికి ముందు ఈ విషయమై ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ), కేంద్ర ఆర్థిక మంత్రి అభిప్రాయాలను స్వీకరించారా? అయితే సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టం కింద ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) అభిప్రాయపడింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు సిఇఎ అరవింద్ సుబ్రమణియం, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయాలను స్వీకరించారా? అనేది వెల్లడించాలని కోరుతూ ఆర్‌బిఐ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి (సిపిఐఒ)ని ఒక వ్యక్తి ఆర్‌టిఐ చట్టం కింద అడిగారు. అయితే ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) కింద సిపిఐఒ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వజాలరని ఆర్‌బిఐ బదులిచ్చింది. అయితే అవి 30 రోజులు దాటినా కనీసం సమాధానం ఇవ్వలేదు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేయడానికి ముందు ఈ విషయమై ప్రధాని సంప్రదించిన వ్యక్తుల పేర్లు, వారి హోదాలను వెల్లడించాలని కూడా ఆర్‌టిఐ కార్యకర్త తన దరఖాస్తులో కోరారు. అయితే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(ఎ), (జి) ప్రకారం ఈ సమాచారాన్ని వెల్లడించకుండా ఉండటానికి మినహాయింపు ఉందని ఆర్‌బిఐ పేర్కొంది.