జాతీయ వార్తలు

జాతీయ రాజకీయాల్లో సిపిఐ(ఎం) వెనుకబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 1: కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గతంలో విపక్షాలను ఏకం చేయడంలో కీలకపాత్ర పోషించిన సిపిఐ(ఎం) ఇప్పుడు చేష్టలుడిగి నిస్సహాయంగా చూడటం మినహా ఏమీ చేయలేకపోతోంది.
ప్రస్తుతం ఆ పార్టీ బలం గణనీయంగా తగ్గిపోవడం, అలాగే బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే బాధ్యతను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన్నుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణాలు.
హరికిషన్ సింగ్ సూర్జిత్, జ్యోతి బసు లాంటి ఎంతో మంది మహా నాయకుల నేతృత్వంలో పనిచేసిన సిపిఐ(ఎం) 1989లో విపి.సింగ్ ప్రభుత్వ ఏర్పాటులోనూ, 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులోనూ, అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపిఎ-1 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించిన విషయం విదితమే.
ఈ ప్రభుత్వాలన్నింటికీ సిపిఐ(ఎం) వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడంతోపాటు అప్పట్లో వివిధ ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలను ఐక్యంగా ఉంచడంలో ఎంతో కీలకంగా వ్యవహరించింది.
అయితే అదంతా గతమని, ఇప్పుడు అటువంటి పాత్ర పోషించే శక్తి సిపిఐ(ఎం)కు లేదని, అటు పార్లమెంట్‌లోనూ, ఇటు సంస్థాగతంగానూ తమ శక్తిసామర్ధ్యాలు సన్నగిల్లడమే ఇందుకు ప్రధాన కారణమని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు హన్నన్ మొల్లా పేర్కొన్నారు.
తప్పులను సరిదిద్దుకుని సిపిఐ(ఎం) మళ్లీ బలాన్ని పుంజుకోకపోతే గత వైభావన్ని సాధించడం అసాధ్యమని ఆయన పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. 1989లో విపి.సింగ్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు లోక్‌సభలో 52 సీట్లు ఉన్న సిపిఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష కూటమి ఆ తర్వాత మరింత బలాన్ని పుంజుకుని 1996లో యునైటెడ్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, అలాగే 2004లో యుపిఎ-1 ప్రభుత్వం ఉన్నప్పుడు 60 వరకు సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ బలం అత్యంత దారుణంగా 11 సీట్లకు పడిపోయింది.