జాతీయ వార్తలు

బిసిసిఐకి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2:బిసిసిఐ వ్యవహార శైలిపై సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించింది. అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి బర్త్ఫ్ చేసింది. తక్షణమే వీరిద్దరూ వైదొలగాలని తీవ్ర స్వరంతో ఆదేశించింది. బిసిసిఐ ప్రక్షాళనకు సంబంధించి తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయనందుకు ఠాకూర్‌పై ధిక్కార చర్యల్ని చేపడతామని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారధ్యంలోని సుప్రీం బెంచి సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరినీ తొలగించిన నేపథ్యంలో బిసిసిఐ వ్యవహారాలను నిపుణులతో కూడిన కమిటి నిర్వర్తిస్తుందని తెలిపింది. ఈ కమిటి సభ్యులుగా మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను నియమించేందుకు సహకరించాలని సీనియర్ న్యాయవాదులు నారిమన్, గోపాల్ సుబ్రమణ్యంను కోరింది. వీరిద్దరు తమకు అప్పగించిన బాధ్యతను రెండు వారాల్లో నెరవేరుస్తారని, నిర్వాహక కమిటీలో ఎవరిని నియమించాలన్న దానిపై 19 ఆదేశాలు జారీ చేస్తామని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎఎమ్ కన్విల్కర్‌లతో కూడి ఈ బెంచి తెలిపింది. కొత్త నిర్వాహకుల కమిటి ఏర్పడే వరకూ బిసిసిఐలోని అత్యంత సీనియర్ ఉపాధ్యక్షుడు దీని అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని, ప్రస్తుత సంయుక్త కార్యదర్శి బోర్డు కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించింది. అంతే కాదు, ఆర్‌ఎమ్ లోధా సిఫార్సులను ఆమోదిస్తూ అత్యున్నత న్యాయస్ధానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని హామీ ఇవ్వాలంటూ బిసిసిఐ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర సంఘాల సభ్యుల్ని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ ఆదేశాలను అమలు చేయడంలో ఏ మాత్రం విఫలమైనా పదవులు కోల్పోతారని కూడా వీరికి స్పష్టం చేసింది. 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు, మంత్రులు, శిక్ష అనుభవించిన నేరస్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఈ పదవులు నిర్వహించిన వ్యక్తులు, ఇతర క్రీడా సంఘాలతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని క్రికెట్ బోర్డుల్లో నియమించకూడదని లోధా కమిటి సిఫార్సులు చేసిన విషయం తెలిసిందే.