జాతీయ వార్తలు

మతం పేరిట ఓటు కోరితే అవినీతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: కులం, మతం వంటి వాటితో లౌకిక స్ఫూర్తికి విఘాతంగా పరిణమిస్తున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చారిత్రక తీర్పు వెలువరించింది. రాజకీయాలతో కుల, మత విశ్వాసాలకు ఎలాంటి సంబంధం ఉండకూడదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. కులం,మతం, జాతి, భాష వంటిని ఎంత మాత్రం రాజకీయ సంబంధితమైనవి కాదని తేల్చిచెప్పింది. వీటి ప్రాతిపదికన ఓట్లు అడిగితే అది అవినీతి చర్యకు పాల్పడినట్టేనని మెజార్టీ తీర్పులో ఉద్ఘాటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123(3) సెక్షన్‌లో పేర్కొన్న ‘హిజ్ రెలీజియన్’అన్న పదం కేవలం అభ్యర్థుల కులం, మత విశ్వాసాలకు మాత్రమే వర్తిస్తుందని 1995లో ఇచ్చిన హిందుత్వ స్పష్టం చేసింది. కానీ, ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారధ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ బెంచి మరింత ముందుకు వెళ్లి ‘హిజ్ రెలీజియన్’అన్న పదం అభ్యర్థులు, ఏజెంట్లు, ఓటర్లు అందరికీ వర్తిస్తుందని రూలింగ్ ఇచ్చింది. ఈ అంశాల ప్రాతిపదికగా ఓట్లు అడిగితే అది అవినీతి చర్యే అవుతుందని తేల్చిచెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల్లో ఉన్న హిజ్ రెలీజియన్ అన్న అంశంపై విచారణ జరిగింది. ఇది కేవలం అభ్యర్థికి మాత్రమే సంబంధించిన నిబంధన కాదని, ఇది మతం, కులం, జాతి, భాష, ప్రాంతాల ప్రాతిపదికగా ఓట్లడిగే అందరికీ వర్తిస్తుందని తెలిపింది. దీని దృష్ట్యా మత విశ్వాసాలను రాజకీయాలకు అతీతంగానే పరిగణించాలని, వీటికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ తీర్పును నలుగురు న్యాయమూర్తులు అనుకూలించారు. హిజ్ రెలీజియన్ నిర్వచన పరిధిపై ముగ్గురు విభేదించారు. కులం, మతం, ఇతర అంశాల ప్రాతిపదికగా ఓట్ల కోసం అప్పీలు చేస్తే ఆ ఎన్నిక రద్దవుతుందని, ఓటర్లు, ప్రత్యర్థి కులం, మతం తదితర అంశాలకూ ఇది వర్తిస్తుందని జస్టీర్ లోకూర్ రాసిన ఈ మెజార్టీ తీర్పు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను పవిత్రంగా ఉంచేందుకు..అవినీతి నిర్వచన పరిధిని పెంచేందుకు 123 సెక్షన్ ఉప సెక్షన్ (3)ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. మైనార్టీ తీర్పురాసిన జస్టీస్ చంద్రచూడ్ హిందుత్వకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పుకు భిన్నంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123 (3) సెక్షన్‌లో పేర్కొన్న హిజ్ రెలీజియన్ అన్న మాట ఓటరు మతం, కులం, భాష, వర్గానికి ఎంత మాత్రం వర్తించదని వివరించారు. ఓట్లు అడిగే వ్యక్తికి అలాగే ప్రత్యర్ధి అభ్యర్ధికి మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించారు.