జాతీయ వార్తలు

సైకిల్ గుర్తు నాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం ఢిల్లీకి చేరింది. ఇటు ములాయం అటు అఖిలేష్ వర్గాలు పార్టీ చిహ్నమైన ‘సైకిల్’కోసం పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ వచ్చిన ములాయం సింగ్ యాదవ్ సైకిల్ గుర్తు తమదేనని వాదించారు. సైకిల్ గుర్తును ఎవరికీ కేటాయించవొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి ములాయం విజ్ఞప్తి చేశారు. ములాయం సోమవారం పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్, మాజీ ఎంపీ జయప్రదతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను కలిసి సమాజ్‌వాదీ పార్టీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల గురించి వివరించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం సమాజ్‌వాదీ సమావేశం నిర్వహించి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన దాదాపు 200 మంది శాసన సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు అఖిలేశ్‌ను ఎస్‌పి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు ప్రకటించగానే సీనియర్ నాయకుడు, తన బాబాయి శివపాల్ యాదవ్‌న సమాజ్‌వాదీ నుంచి బహిష్కరించారు. ఆయన అంతటితో ఆగకుండా పార్టీ ఎన్నికల చిహ్నమైన సైకిల్ గుర్తు కూడా తమకే చెందుతుందని ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఢిల్లీకి హుటాహుటిన వచ్చి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ రాజ్యాంగ విరుద్ధమని, తనదే అసలైన పార్టీ అని వాదించారు. సమాజ్‌వాదీ పార్టీని తాను స్థాపించానని, సైకిల్ గుర్తుకోసం తాను కృషి చేసి సాధించాను కాబట్టి దానిని తనకే పరిమితం చేయాలని వాదిస్తూ ఒక వినతి పత్రం అందజేశారు. ములాయం సింగ్ యాదవ్ ఇసిని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. త్వరలోనే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు.

చిత్రం..ఢిల్లీలో సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వెలుపలకు వస్తున్న ములాయం సింగ్ యాదవ్