జాతీయ వార్తలు

తక్షణమే ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: పెద్ద నోట్ల రద్దు కారణంగా తలెత్తిన సమస్యల నుంచి పేదలకు తక్షణమే, ఇప్పటికిప్పుడే ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. తమ సమస్యల పరిష్కారం కోసం నిరీక్షించే ఒపిక వీరికెంత మాత్రం ఉండదని తేల్చిచెప్పారు. పెద్దనోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లనుద్దేశించి గురువారం వీడియోలో మాట్లాడిన ప్రణబ్ ‘నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వృద్ధి మందగించడానికి దారితీయవచ్చు. దీర్ఘకాలంలో ప్రయోజనాలు కలిగించే ఈ నిర్ణయం వల్ల పేదలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా అవసరం’అని ఉద్ఘాటించారు. ఆకలి, నిరుద్యోగం, దోపిడీలకు తావులేని జాతి నిర్మాణంలో పేదలు క్రియాశీలకంగా పాలుపంచుకోవాలంటే ప్రస్తుత సమస్యల నుంచి వారిని గట్టెక్కించే మార్గాలపై తక్షణమే దృష్టి పెట్టాలన్నారు. ప్రధాని మోదీ ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాల వల్ల సామాన్యులకు కొంత మేర ఉపశమనం కలిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాదిలో మొత్తం ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయని తెలిపిన రాష్టప్రతి నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను నిర్వహించడం వల్లే భారత ప్రజాస్వామ్యం దేదీప్యమైందన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుక పోటాపోటీగా జనాకర్షక నిర్ణయాలు ప్రకటించడం, ప్రజల్ని ఏదో విధంగా ఆకర్షించడమే ధ్యేయంగా మాట్లాడటం, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. అన్ని వర్గాల మధ్య సుహృద్భావ వాతావరణం బలోపేతం కావాలని, మతపరమైన ఉద్రిక్తతలు వెర్రితలలు వేయకుండా జాగరూకతతో వ్యవహరించాలని రాష్టప్రతి హెచ్చరించారు.

చిత్రం..గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
మాట్లాడుతున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ