జాతీయ వార్తలు

యూపీలో అఫిడవిట్ల పర్వం మద్దతు కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 5: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాది పార్టీ నాయకత్వం అయోమయంలో పడిపోయింది. తండ్రీ కొడుకుల మధ్య నిట్టనిలువునా చీలిపోయిన ఈ పార్టీ భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ములాయంసింగ్ సారథ్యంలోని ఒక వర్గం, ముఖ్యమంత్రి అఖిలేష్ సారథ్యంలోని మరో వర్గం పార్టీ గుర్తయిన సైకిల్ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడటంతో ఇక రాజీ కథ కంచికేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఓపక్క ఎన్నికల షెడ్యూల్‌కూడా వెలువడటంతో పార్టీ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ఇటు ములాయం, అటు అఖిలేష్ బృందాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. పార్టీ గుర్తు కోసం ఎన్నికల కమిషన్ ముందు తమ మెజారిటీని నిరూపించుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ డెలిగేట్ల బలాన్ని సమకూర్చుకునేందుకు ములాయం, అఖిలేష్ వర్గాలు గురువారం తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. సైకిల్ గుర్తు మాతృపార్టీ అయిన సమాజ్‌వాదీదేనంటూ ఆ పార్టీ సంస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. తాజాగా గురువారం కూడా తన వాదనను సమర్థించుకుంటూ మరిన్ని వివరాలను కమిషన్‌కు అందించారు. అయితే ఆయన కుమారుడు, యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ మాత్రం ఇక్కడ తన అధికార నివాసంలోనే మకాం పెట్టి తన మద్దతుదారులనుంచి అఫిడవిట్లు సేకరించడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఓసారి తన తండ్రి ములాయంతో భేటీ అయినప్పటికీ తన నిర్ణయం విషయంలో రాజీ లేదని అఖిలేష్ కరాఖండీగా వెల్లడించారు. రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ చేసిన ప్రయత్నాలేవీ ఇప్పటివరకు ఫలించలేదు. కాగా, అఖిలేష్‌కు సన్నిహితుడుగా భావిస్తున్న నరేష్ అగర్వాల్ మాత్రం ఇప్పటికే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు తమకే ఉందని స్పష్టం చేశారు. దీని దృష్ట్యా పార్టీ ఎన్నికల చిహ్నమైన సైకిల్ తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ములాయంసింగ్ యాదవ్ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలనుంచి అఫిడవిట్లు స్వీకరించారని వాటిని ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే అఖిలేష్‌కు మద్దతు ఇచ్చిన వారి సంఖ్య ఎంత? ములాయంను బలపరుస్తున్నవారి జాబితాపై ఎలాంటి స్పష్టత లేదు.