జాతీయ వార్తలు

నితీశ్, మోదీ మెచ్చుకోలు ముచ్చట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జనవరి 5: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో మద్యంపై యుద్ధం ప్రకటించినందుకు నితీశ్‌ను అభినందించిన ప్రధాని మద్య నిషేధం విజయవంతం కావడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మద్యపానంపై ఉద్యమాన్ని ప్రారంభించినందుకు నితీశ్ కుమార్‌ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు. సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ 350వ జయంతి సందర్భంగా గురువారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ మద్య నిషేధాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని మోదీని కోరిన తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మద్య నిషేధం అనేది కేవలం నితీశ్ కుమార్ లేదా ఒక పార్టీ కృషివల్ల విజయవంతం కాదని, అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, పౌరులు అందరూ దీనిలో పాల్గొనడం ద్వారా దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేయాలని మోదీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటినుంచి గుజరాత్‌లో అమలులో ఉన్న మద్య నిషేధాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోదీ విజయవంతంగా కొనసాగించారని నితీశ్ తన ప్రసంగంలో అన్నారు. ప్రధాని మోదీ, నితీశ్ రాజకీయంగా బద్ధ శత్రువులైనప్పటికీ పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయానికి నితీశ్ మద్దతు తెలపడం తెలిసిందే. కాగా, ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవిద్, కేంద్రమంత్రులు రాంవిలాస్ పాశ్వాన్, రవిశంకర్ ప్రసాద్ కూడా వేదికపై ఉన్నారు. కాగా ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్, పంజాబ్, బిహార్ రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్, బిజెపి సీనియర్ నాయకుడు, పాట్నా సాహిబ్ ఎంపి శత్రుఘ్న సిన్హా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు.

చిత్రాలు..గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా గురువారం పాట్నాలో జరిగిన కార్యక్రమంలో వేదికపై ప్రధాని మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. గోవింద్ సింగ్‌కు ప్రణామం చేస్తున్న మోదీ