జాతీయ వార్తలు

గాంధీబొమ్మ లేని రూ.2000 నోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జనవరి 5: కొత్త కరెన్సీ నోట్ల ముద్రణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవల్సిన అధికారులు గాలికొదిలేస్తున్నారు. పని వత్తిడి వల్లే 500 రూపాయల నోట్ల ముద్రణలో తప్పిదాలు జరిగాయని ఇటీవల చెప్పుకొచ్చిన ఆర్‌బిఐ భోపాల్‌లో మహాత్మాగాంధీ బొమ్మ లేకుండా 2000 ఓ వ్యక్తి చేతికి వచ్చిన రూపాయల నోటుకు ఏ సమాధానం చెబుతారో చూడాలి. మధ్యప్రదేశ్‌లోని షోపూర్ జిల్లాలో ఓ రైతుకు మహాత్మాగాంధీ బొమ్మ లేని 2000 రూపాయల నోట్లు వచ్చాయి. బిచ్చుగవాడీ గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్ మీనా బరోడా పట్టణంలోని ఓ జాతీయ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి నగదు విత్‌డ్రా చేశాడు. తీరా చూస్తే మూడు 2000 రూపాయల నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మే లేదు. సరుకులకోసం మార్కెట్‌కి వెళ్లి చూడగా నోట్లపై గాంధీ చిత్రం కనిపించలేదని, వెంటనే కంగారుపడి బ్యాంక్ వెళ్లి మేనేజ్‌కు ఈ విషయం చెప్పినట్టు మీనా తెలిపాడు. ఈ విషయాన్ని ముందు తేలిగ్గా తీసుకున్న బ్యాంక్ మేనేజర్ ఎందుకలా జరిగిందో పరిశీలిస్తానని అన్నాడు. రైతు ఆందోళనను అర్థం చేసుకున్న తరువాత ఆ నోట్లు డిపాజిట్ చేసి కొత్త నోట్లు తీసుకెళ్లమని చెప్పారు. అయితే అవి నకిలీ నోట్లు కాదని, ముద్రణా లోపం వల్ల అలా జరిగిందని ఆ బ్యాంక్ మేనేజర్ పేర్కొన్నారు. ఈ సంఘటన ఈ నెల 3న జరగ్గా మర్నాడు అంటే బుధవారం కొత్త నోట్లు ఇచ్చారని లక్ష్మణ్ మీనా చెప్పాడు. దీనిపై పై అధికారులకు సమాచారం అందజేసినట్టు మేనేజర్ వెల్లడించారు.