జాతీయ వార్తలు

బెంగాల్‌లో నేడు రెండో విడత పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 16: పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నకల్లో భాగంగా 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేయడం, తృణమూల్ కాణగ్రెస్ పార్టీ నాయకుడు అనుబ్రత మండల్‌పై ఇసి నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో రెండో దశ ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం.
ఉత్తర బెంగాల్‌లోని ఆరుజిల్లాలు అలీపూర్‌ద్వార్, జల్పాయిగురి, డార్జిలింగ్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, మాల్డా, దక్షిణ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని ఈ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న మొత్తం 383 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని కోటీ 20 లక్షలకు పైగా ఓటర్లు నిర్ణయించనున్నారు.
అభ్యర్థుల్లో 33 మంది మహిళలున్నారు. బీర్‌భూమ్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఇక్కడ పోలింగ్ ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 4 గంటలవరకు జరుగుతుంది.
మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల దాకా ఓటర్లు ఓటు వేయవచ్చు. మొత్తం 13,600 పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండో దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో సిలిగురి నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకరిషస్తోంది. ఇక్కడ నగర మేయర్, సిపిఎం మాజీ మంత్రి అశోక్ భట్టాచార్యపై టిఎంసి అభ్యర్థి, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా పోటీ చేస్తుండడమే దీనికి కారణం.