జాతీయ వార్తలు

లెక్క చూస్తే తప్ప చెప్పలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: పెద్ద నోట్ల రద్దు తర్వాత రద్దయిన నోట్లలో దాదాపు 97 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయంటూ మీడియాలో వచ్చిన కథనాలపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) స్పందించింది. వార్తాసంస్థలు, సంబంధిత ఏజన్సీలు వెలువరించిన రిపోర్టులు సరైనవి కావని గురువారం తేల్చేసింది. 2016 డిసెంబర్ 30తో పాతనోట్ల డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత బ్యాకింగ్ వ్యవస్థలోకి వచ్చి చేరిన పాత నోట్లపై ఆర్‌బిఐ కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రకటనలూ చేయలేదని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పాత నోట్లు రద్దయినప్పటినుంచి బ్యాకింగ్ వ్యవస్థలోకి వచ్చి చేరిన నోట్లను లెక్కించే ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు, అకౌంటింగ్ లోపాలను, డబుల్ అకౌంటింగ్ దోషాలు లాంటి వాటిని తొలగిస్తూ వాస్తవంగా నగదు బ్యాలెన్స్‌లను సరి చూడాల్సిన అవసరం ఉందని, ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మాత్రమే బ్యాంకులకు ఏ మేరకు రద్దయిన నోట్లు తిరిగి వచ్చాయో తేలుతుందని ఆర్‌బిఐ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘రద్దయిన నోట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాం. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు బ్యాకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చిన పాత నోట్లు ఎన్ని అనే దానిపై ఎలాంటి సంకేతాలను ఇవ్వలేం’ అని ఆ ప్రకటనలో ఆర్‌బిఐ స్పష్టం చేసింది. డిసెంబర్ 30తో ముగిసిన 50 రోజుల పాతనోట్ల రద్దు ప్రక్రియ సందర్భంగా చలామణిలో ఉన్న దాదాపు 15.4 లక్షల కోట్ల రూపాయల విలువైన వెయ్యి, అయిదు వందల రూపాయల నోట్లలో 97 శాతం అంటే దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్‌బిఐ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే గత డిసెంబర్ 10న ఆర్‌బిఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో దాదాపు 12.5 లక్షల కోట్ల విలువైన రద్దయిన పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు పేర్కొనడం తెలిసిందే.

చిత్రం..ఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్