జాతీయ వార్తలు

మండుతున్న భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశం సూర్యుడి అగ్నిశిఖలకు మాడి మసైపోతోంది. ఏ రాష్ట్రం చూసినా అదే పరిస్థితి. ఈశాన్యరాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ వడగాడ్పులు ప్రజల జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, చండీగఢ్, మరాఠ్వాడా, విదర్భ, తెలంగాణ, రాయల సీమల్లో వేడి సెగలు భగ్గుమంటున్నాయి. మరాఠ్వాడాలోని లాతూర్ ప్రజలు దాహార్తిని తీర్చుకోలేక వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం మరోసారి నీళ్లతో కూడిన రైలు లాతూర్‌కు వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. విదర్భ, నాగపూర్‌లలో వరుసగా మూడో రోజు కూడా 44డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టలేదు. ఒడిషా పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇక్కడ 46డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో అయిదు రోజుల వరకూ ఒడిషాకు ఈ వేడిమి నుంచి ఉపశమనం లేదని వాతావరణశాఖ కుండబద్దలు కొడుతోంది.
ఢిల్లీ, జెంషెడ్‌పూర్, కోటా, జైపూర్.. ఇలా నైరుత భారతంలోని పలు నగరాలు సూర్యుడి ప్రతాపానికి విలవిల్లాడిపోతున్నాయి.