జాతీయ వార్తలు

తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: కేంద్ర ప్రభుత్వం తమిళనాడు, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమించే విషయం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసినప్పటి నుండి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు తమిళనాడు గవర్నర్‌గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నందున అక్కడ పూర్తి స్థాయి గవర్నర్ ఉండటం మంచిదని భావిస్తున్న ఎన్‌డిఏ ప్రభుత్వం కృష్ణంరాజుతో పాటు మరో ఇద్దరి పేర్లను పరిశీలిస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ గవర్నర్ పదవికి కర్నాటకకు చెందిన సీనియర్ బిజెపి నాయకుడు, విధాన పరిషత్ అధ్యక్షుడు డిహెచ్ శంకరమూర్తి పేరు పరిశీలనలో ఉన్నదనే వార్తలు వస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చాలా కాలం నుండి నరసింహన్ సంయుక్త గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కారమైనందున రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించటం మంచిదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

చిత్రాలు.. కృష్ణంరాజు, శంకరమూర్తి