జాతీయ వార్తలు

లష్కరే ఉగ్రవాది అలీపై ఎన్‌ఐఏ చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: లష్కరే ఉగ్రవాది బహదూర్ అలీపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) పాటియాలా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూకాశ్మీర్‌లో భద్రతాదళాలకు గత ఏడాది జూలైలో పట్టుబడ్డాడు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ భారత్‌పై దాడులకు వ్యూహరచన చేసేవాడు. బహదూర్ అలీ పాకిస్తాన్‌లో శిక్షణ పొందాడని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. అతడూ పాకిస్తాన్‌లోని లాహోర్ జిల్లా జియాబఘా గ్రామానికి చెందిన వాడు. ఎల్‌ఓసి నుంచి భారత్‌లోకి చొరబడినట్టు ఇంటరాగేషన్‌లో అతడు వెల్లడించాడన్నారు. పిఓకెలో కంట్రోల్ రూమ్‌కు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేవాడని వారు తెలిపారు. నిత్యం అలజడులతో ఉండే కాశ్మీర్‌లోయలో వేర్పాటువాదులను రెచ్చగొట్టడం, తీవ్రవాదంపై వారిని ఉసిగొల్పడం వంటి వాటిలో అలీ కీలక పాత్ర పోషించేవాడని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. ఆయుధాలు చేరవేత, కమ్యూనికేషన్ అందజేసేవాడని చెప్పారు.