జాతీయ వార్తలు

ముస్లింలకు మాయావతి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి వ చ్చేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి ముస్లిం- దళిత్ సంయోగత ద్వారా ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ముస్లిం, దళితులతోపాటు ఉన్నత వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించటం ద్వారా సమాజ్‌వాదీకి పెట్టని కోటగా ఉన్న యాదవ్- ముస్లిం సంయోగం (కాంబినేషన్)తో పాటు ఉన్నత వర్గాల మద్దతు ఉన్న బిజెపిని దెబ్బతీసేందుకు మాయావతి ప్రయత్నిస్తున్నారు. త్వరలో జరుగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ఆమె ముస్లింలకు 24 శాతం, దళితులకు 21 శాతం, వెనకుబడిన కులాలకు 26 శాతం, ఉన్నత వర్గాలకు చెందిన వారికి 28 శాతం సీట్లు కేటాయించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 40 శాతం ఉన్న బిసిలకు 26 శాతం సీట్లు మాత్రమే కేటాయించిన ఆమె, ముస్లిం, దళితులకు కలిపి 45 శాతం సీట్లు కేటాయించడం గమనార్హం. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు 85 టికెట్లు ఇచ్చిన మాయావతి ఈసారి ఆ టికెట్ల సంఖ్య ను 97కు పెంచారు. రాష్ట్ర శాసన సభలోని మొత్తం 403 సీట్లలో ముస్లింలకు దాదాపు మూడో వంతు సీట్లు కేటాయించి దళితుల సీట్లను 88 నుంచి 87కు తగ్గించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ-దళిత వ్యూహంతో ముం దుకెళ్లిన మాయావతి అప్పట్లో బ్రా హ్మణ వర్గానికి 86 సీట్లు కేటాయించగా, ప్రస్తుతం వాటిని 66కు తగ్గించారు. అలాగే గత ఎన్నికల్లో బిసిలకు కేటాయించిన 113 సీట్లను ఇప్పుడు 106కు కుదించారు.