జాతీయ వార్తలు

9ఎన్‌జిఓలకు హెచ్‌సిఎల్ గ్రాంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: హెచ్‌సిఎల్ సంస్థ తన గ్రాంట్‌ను మంజూరు చేసేందుకు దేశంలో తొమ్మిది ఎన్‌జిఓలను షార్టు లిస్టు చేసిందని సంస్థ సిఎస్‌ఆర్ డైరెక్టర్ నిధి పుంధిర్ తెలిపారు.
ఆరోగ్యం, విద్య, పర్యావరణ రంగాల్లో సేవలు అందించేందుకు హెచ్‌సిఎల్ సంస్థ 15 కోట్లు గ్రాంట్‌గా అందిస్తోంది. ఆరోగ్యం విభాగంలో చైల్డ్ ఇన్ నీడ్ ఇనిస్టిట్యూట్ (పశ్చిమబెంగాల్), కరుణ ట్రస్టు (కర్నాటక), తమిళనాడు నెట్‌వర్కు ఆఫ్ పాజిటివ్ పీపుల్ (తమిళనాడు), విద్యా రంగంలో మెలోజోల్ (మహారాష్ట్ర), బ్రేక్‌త్రూ (హర్యానా), ఉర్ముల్ సేతు సంస్థాన్ (రాజస్థాన్) , పర్యావరణ రంగంలో వైల్ట్ లైఫ్ ట్రస్టు ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ), ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ (గుజరాత్), డెవలప్‌మెంట్ రీసెర్చి కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ సెంటర్ (పశ్చిమబెంగాల్)లను ఎంపిక చేశారు.
అయితే రాబిన్ అబ్రహం, డాక్టర్ ఐషర్ జుడ్గే అహ్లువాలియా, పల్లవి ష్రాఫ్, బిఎస్ బస్వాన్, రిచర్డ్ లారివైరె, డాక్టర్ జాన్ ఇ కెల్లీ, శివ్‌నాడర్‌లతో కూడిన జ్యూరీ మూడు సంస్థలను ఎంపిక చేస్తుందని పుంథిర్ చెప్పారు.