జాతీయ వార్తలు

ఇంజనీరింగ్‌కూ నీట్ తరహా పరీక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ‘నీట్’ పరీక్ష తరహాలో ఇంజనీరింగ్ కోర్సులకూ దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించే విషయమై సమాలోచనలు సాగుతున్నాయి. ఈ నెల చివర్లో జరగనున్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటిఇ) భేటీలో ఈ విషయమై చర్చ జరగనుంది. నీట్ తరహాలో ఇంజనీరింగ్ కాలేజిలకు కూడా ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించడం వల్ల ఇంజనీరింగ్ విద్య నాణ్యతకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారం అవడంతోపాటు పారదర్శకతను తీసుకురావచ్చని మానవ వనరుల మంత్రిత్వ శాఖ వర్గాలు భావిస్తోంది. ప్రస్తుతం జెఇఇ పేరుతో సిబిఎస్‌ఇ ఉమ్మడి ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. దీని ఆధారంగా ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక జరుగుతోంది. కాగా ఇంజనీరింగ్ కాలేజిలనుంచి ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల నైపుణ్యం, వారి ఉద్యోగితకు సంబంధించిన అంశాలను అంచనా వేయడం కోసం ఎగ్జిట్ టెస్ట్ నిర్వహించాలనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించవచ్చని తెలుస్తోంది.