జాతీయ వార్తలు

కాశ్మీర్‌కు అదనపుబలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 16: జమ్మూకాశ్మీర్‌లోని హంద్వారా పట్టణంలో విద్యార్థినిపై ఓ జవాన్ అసభ్య ప్రవర్తన నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు తగ్గించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ ఘటన తరువాత జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. శాంతి భద్రతలు అదుపుచేయడానికి కేంద్రం అదనపుబలగాలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. 3,600 మంది సాయుధ బలగాలు కాశ్మీర్ లోయ ప్రాంతంలో మోహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇలా ఉండగా పోలీసులు తమ కుమార్తె వత్తిడి తీసుకొచ్చిన ఎలాంటి వేధింపులు, అసభ్యప్రవర్తన జరగలేదని వాంగ్మూలం నమోదు చేశారని విద్యార్థిని తల్లి ఆరోపించారు. పోలీసులు చెబుతున్న వీడియో స్టేట్‌మెంట్ ఓ కట్టుకథ అని ఆమె తెలిపారు.‘16 ఏళ్ల నా కుమార్తెను ఒంటరిగా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమెను బలవంతపెట్టి వాంగ్మూలం నమోదు చేశారు. పోలీసుల విపరీతమై వత్తిడి చేసి వాంగ్మూలం తీసుకున్నారు’అని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమెను ఒంటరిగా పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లారని, ఆమె ముఖం కనిపించకుండా వీడియో స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. కుమార్తెకు జరిగిన అవమానంపై ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మంగళవారం నాడు స్కూలు నుంచి ఇంటికొచ్చిన బాలిక బాత్ రూమ్‌లోకి వెళ్లింది. అదే సమయంలో ఓ జవాను ఆమెను అనుసరించి బాత్‌రూమ్‌లోకి రావడం చూసి బిగ్గరగా అరచింది. సమీపంలోని దుకాణాదారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చేసరికి జవాన్ పారిపోయాడు. అయితే పోలీసులు తమ కుమార్తెను చెప్పాపెట్టకుండా స్టేషన్‌కు తీసుకెళ్లారని తల్లి వాపోయింది. తమ కుమార్తెను కలవడానికి అనుమతించలేదని, పైగా తండ్రి, ఆంటీని పోలీసులు అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. అరెస్టుచేసి ఐదు రోజులైనా తమ కుమార్తె గురించి సమాచారం లేదని తల్లి తెలిపింది.
పోలీసులు, ప్రభుత్వ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్న ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మృతి చెందారు. హంద్వారాతోపాటు అనే పట్టణాల్లో నిషేధాజ్ఞలు అమలవవుతున్నాయి. విద్యార్థినిపై వేధింపులు, తరువాత తలెత్తిన పరిణామాల నేపథ్యంలో నష్టనివారణకు కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ కార్యదర్శిగా అదనపుబాధ్యతలు నిర్వహిస్తున్న రతన్ పి వటల్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఐబి, రక్షణ, సాయుధ దళాల సీనియర్ అధికారులు పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. అదనపుబలాగాలు పంపాలని నిర్ణయించారు. తక్షణం 12 కంపెనీల పారామిలటరీ దళాలు శనివారం సాయంత్రానికే రాష్ట్రానికి చేరుకున్నాయి. మరో 24 కంపెనీలు ఆదివారానికి కాశ్మీర్ చేరుకుంటాయి. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, హంద్వారా పట్టణాల్లో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి.

చిత్రం కాశ్మీర్‌లోని హంద్వారాలో పహరా కాస్తున్న జవాన్లు