జాతీయ వార్తలు

దిలీప్‌కుమార్‌కు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 16: బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ తీవ్ర అస్వస్థతతో శనివారం ఉదయం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. నిపుణుల పర్యవేక్షణలో దిలీప్‌కుమార్‌కు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని. ఇప్పటికిప్పుడు ఏ విషయం చెప్పలేమని లీలావతి ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు. ‘ప్రస్తుతం అయితే కుమార్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉంది. నిపుణుల అబ్జర్వేషన్‌లో ఉంచాం. మరో 72 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేం’అని ఆయన స్పష్టం చేశారు. 93 ఏళ్ల దిలీప్‌కుమార్‌ను తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలీవుడ్ లెజెండ్ దిలీప్‌కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యు లు తెలిపారు. జ్వరానికి తోడు న్యూమోనియాతో ఆయన బాధపడుతున్నారని పార్కర్ పేర్కొన్నారు. వెండితెరను ఆరు దశాబ్దాలు ఏలిన దిలీప్ అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో నటించారు. మధుమతి, దేవదాస్, మొఘల్ ఏ అజాం, గంగాజమున, రామ్ ఔర్ శ్యాం, కర్మ వంటి చిత్రాల్లో జీవించారు. 1998లో ఖ్విలా ఆయన నటించిన ఆఖరి చిత్రం. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు.